Supreme Court: తిరుపతన్నకు బెయిల్

Supreme Court

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు అప్పటి ఏసీపీ తిరుపతన్నకు (Supreme Court) సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇవాళ జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది. ఈ మేరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పిటిషనర్ ఇప్పటికే 10 నెలల పాటు జైల్లో ఉన్నారని, కేసులో చార్జిషీటు కూడా దాఖలైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు పలు కండీషన్లతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ట్రయల్ కు పూర్తిగా సహకరించాలని పిటిషనర్ ను ఆదేశించింది.

Telangana HC dismisses bail plea of former Addl DCP Mekala Tirupathanna in  phone tapping caseసాక్షులను ప్రభావితం చేసినా, కేసులో ఆధారాలు చెరిపేసేందుకు యత్నించినా రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రద్దును కోరుతూ కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. పాస్ పోర్టు సరెండర్ చేయడం సహా ఇతర బెయిల్ షరతులు అన్ని ట్రయల్ కోర్టు ఇస్తుందని ధర్మాసనం సూచించింది. కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో తిరుపతన్న ప్రధాన నిందితుడని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో తిరుపతన్న పాత్ర దర్యాప్తుకు మరో నాలుగు నెలల సమయం పడుతుందని కోర్టుకు చెప్పారు. తిరుపతన్న ఆధారాలు, డేటా ధ్వంసం చేశారని, ప్రస్తుతం గూగుల్ సర్వర్ నుంచి సమాచారం తీసుకుంటున్నామని వివరించారు. కొంత మంది కీలక సాక్షులను ఇంకా విచారించాల్సి ఉందని తిరుపతన్నకి బెయిల్ ఇవ్వొద్దని కోరారు.

Supreme Court Resumes Hearing on Additional SP Thirupathanna's Bail Plea in  Phone Tapping Caseరాజకీయ నేతల ఆదేశాల మేరకు ప్రయివేట్ వ్యక్తుల ఫోన్లను ట్యాప్‌‌ చేశారని, హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఇందులో ఉన్నాయని తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌ 3న ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆధారాలన్నీ ధ్వంసం చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న న్యాయస్థానం పిటిషనర్ 10 నెలలు జైల్లో ఉన్నారని పేర్కొంది. చార్జిషీట్ కూడా దాఖలైనందున షరతులతో కూడిన (Supreme Court) బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది.

Bail Application Must Be Decided Expeditiously And Not To Be Posted In 'Due  Course Of Time': Supreme Court

తిరుపతన్న ఆధారాలు, డేటా ధ్వంసం చేశారని, ప్రస్తుతం గూగుల్ సర్వర్ నుంచి సమాచారం తీసుకుంటున్నామని వివరించారు. కొంత మంది కీలక సాక్షులను ఇంకా విచారించాల్సి ఉందని తిరుపతన్నకి బెయిల్ ఇవ్వొద్దని కోరారు. రాజకీయ నేతల ఆదేశాల మేరకు ప్రయివేట్ వ్యక్తుల ఫోన్లను ట్యాప్‌‌ చేశారని, హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఇందులో ఉన్నాయని తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌ 3న ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆధారాలన్నీ ధ్వంసం చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న న్యాయస్థానం పిటిషనర్ 10 నెలలు జైల్లో ఉన్నారని పేర్కొంది. చార్జిషీట్ కూడా దాఖలైనందున షరతులతో కూడిన (Supreme Court) బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది.

also read: