Suryapet: సూర్యాపేటలో పరువు హత్య

Suryapet

(Suryapet)సూర్యాపేటలో పరువు హత్య కలకలం రేపుతోంది. సూర్యాపేట టౌన్​ మామిల్లగడ్డ కు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి దారుణ హత్యకు గురయ్యాడు. పిల్లలమర్రి సమీపంలోని మూసీ కాలవ కట్టపై డెడ్​బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్యకు ప్రేమ వివాహమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆరు నెలల కిందట పిల్లలమర్రి గ్రామానికి చెందిన కోట్ల భార్గవి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్న బంటి (Suryapet) సూర్యాపేటలో కాపురం పెట్టాడు. ప్రేమ పెండ్లిని నిరాకరించిన భార్గవి తల్లిదండ్రులు వారినే విడదీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు.

Image కులాంతర వివాహం చేసుకున్న బంటి పై కక్ష పెంచుకున్న భార్గవి సోదరుడు కోట్ల నవీన్ హత్యకు పాల్పడ్డట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిన్న సాయంత్రం మహేష్ అనే ప్రెండ్​ నుంచి ఫోన్ చేయగా బంటి భార్య కు ఫోన్ ఇచ్చి బయటకు వెళ్లాడు. రాత్రి ఇంటికి చేరుకోకపోవడంతో బంటి ఆచూకీపై ఆందోళనకు గురైన పీఎస్​లో ఫిర్యాదు చేశారు. ఇవాళ తెల్లవారుజామున బార్గవి ఇంటికి దగ్గరలోని పిల్లలమర్రి చెరువు శివారులో డెడ్​బాడీని పడేశారు. మృతుడి వంటిపై కమిలిన గాయాలు ఉండటంతో పాటుగా, మెడకు ఉరి వేసి చంపినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు.

సూర్యాపేటలో పరువు హత్య కలకలం రేపుతోంది. సూర్యాపేట టౌన్​ మామిల్లగడ్డ కు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి దారుణ హత్యకు గురయ్యాడు. పిల్లలమర్రి సమీపంలోని మూసీ కాలవ కట్టపై డెడ్​బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్యకు ప్రేమ వివాహమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆరు నెలల కిందట పిల్లలమర్రి గ్రామానికి చెందిన కోట్ల భార్గవి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్న బంటి సూర్యాపేటలో కాపురం పెట్టాడు. ప్రేమ పెండ్లిని నిరాకరించిన భార్గవి తల్లిదండ్రులు వారినే విడదీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కులాంతర వివాహం చేసుకున్న బంటి పై కక్ష పెంచుకున్న భార్గవి సోదరుడు కోట్ల నవీన్ హత్యకు పాల్పడ్డట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

నిన్న సాయంత్రం మహేష్ అనే ప్రెండ్​ నుంచి ఫోన్ చేయగా బంటి భార్య కు ఫోన్ ఇచ్చి బయటకు వెళ్లాడు. రాత్రి ఇంటికి చేరుకోకపోవడంతో బంటి ఆచూకీపై ఆందోళనకు గురైన పీఎస్​లో ఫిర్యాదు చేశారు. ఇవాళ తెల్లవారుజామున బార్గవి ఇంటికి దగ్గరలోని పిల్లలమర్రి చెరువు శివారులో డెడ్​బాడీని పడేశారు. మృతుడి వంటిపై కమిలిన గాయాలు ఉండటంతో పాటుగా, మెడకు ఉరి వేసి చంపినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు.

Also read: