పట్టణాల్లో ఉన్న రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించే అంశంపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు (High Court) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన గవినోళ్ల శ్రీనివాస్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై (High Court)హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. భూమిలేని రైతు కూలీలలకు ఏటా రూ.12వేలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం రూపొందించిందని, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న రైతు కూలీలకు డబ్బులు ఇవ్వడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కారణంగా 129 మున్సిపాలిటీల్లో 8లక్షల మందికి పైగా రైతు కూలీలు ఈ పథకాన్ని కోల్పోతున్నారని పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. గ్రామాల్లో ఉన్న రైతు కూలీలకు ఇచ్చి మున్సిపాలిటీల్లోని వారికి ఇవ్వకపోవడం సరికాదన్నారు. రైతు కూలీలు ఎక్కడ ఉన్నా అందరూ సమానమేనని చెప్పారు. కేవలం గ్రామాల్లో ఉన్న రైతు కూలీలకే ఈ పథకం వర్తింపజేయడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని పేర్కొంటూ పలు తీర్పులను ప్రస్తావించారు. వాదనలు నమోదు చేసుకున్న హైకోర్టు 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.

పట్టణాల్లో ఉన్న రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించే అంశంపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన గవినోళ్ల శ్రీనివాస్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. భూమిలేని రైతు కూలీలలకు ఏటా రూ.12వేలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం రూపొందించిందని, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న రైతు కూలీలకు డబ్బులు ఇవ్వడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు.

Also read: