మౌని అమావాస్య జాతర సందర్భంగా (Medak district)మెదక్ జిల్లా పాపన్న పేట మండలంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ఏడుపాయల జన సంద్రమైంది. మంజీరా నది ఉత్తర వాహిణిగా ప్రవహించే ఏడుపాయల లో పవిత్ర స్నానాలు చేసేందుకు తెల్లవారు జాము నుంచే ఉమ్మడి (Medak district) మెదక్ జిల్లా లోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ ,- సికింద్రాబాద్ జంట నగరాల నుంచి, పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఘనపూర్ ఆనకట్ట గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో ఏడుపాయల లోని మంజీరా నది పాయలు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో ఘన పూర్ ఆనకట్ట దగ్గర, నదీ పాయల వెంట ఏర్పాటు చేసిన షవర్ల దగ్గర భక్తులు స్నానాలు చేసి వన దుర్గా భవాని మాత ను దర్శించుకుని అమ్మవారికి ఒడి బియ్యం పోశారు. మాఘ అమావాస్య జాతర సందర్భంగా వన దుర్గా భవానీ మాత ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనం ఇచ్చారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో అమ్మవారి దర్శనానికి భక్తులు చాలా సేపు క్యూ లైన్ లలో వేచి ఉండాల్సి వస్తోంది. రద్దీకి అనుగుణంగా. ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు వేశారు. ఆలయ పరిసరాల్లోని నదీపాయల వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి మొత్తం 3 జలుస్నాన ఘట్టాలను ఏర్పాటు చేశారు. మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో డీఎస్పీ ప్రసన్నకుమార్ 221 మంది సిబ్బంది. 4 క్యూఆర్టీ బృందాలతో బందోబస్తును పర్యవేక్షించనున్నారు. ఎండోమెంట్ అధికారులు భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు.

మౌని అమావాస్య జాతర సందర్భంగా మెదక్ జిల్లా పాపన్న పేట మండలంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ఏడుపాయల జన సంద్రమైంది. మంజీరా నది ఉత్తర వాహిణిగా ప్రవహించే ఏడుపాయల లో పవిత్ర స్నానాలు చేసేందుకు తెల్లవారు జాము నుంచే ఉమ్మడి మెదక్ జిల్లా లోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ ,- సికింద్రాబాద్ జంట నగరాల నుంచి, పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఘనపూర్ ఆనకట్ట గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో ఏడుపాయల లోని మంజీరా నది పాయలు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో ఘన పూర్ ఆనకట్ట దగ్గర, నదీ పాయల వెంట ఏర్పాటు చేసిన షవర్ల దగ్గర భక్తులు స్నానాలు చేసి వన దుర్గా భవాని మాత ను దర్శించుకుని అమ్మవారికి ఒడి బియ్యం పోశారు. మాఘ అమావాస్య జాతర సందర్భంగా వన దుర్గా భవానీ మాత ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనం ఇచ్చారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో అమ్మవారి దర్శనానికి భక్తులు చాలా సేపు క్యూ లైన్ లలో వేచి ఉండాల్సి వస్తోంది. రద్దీకి అనుగుణంగా. ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు వేశారు. ఆలయ పరిసరాల్లోని నదీపాయల వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి మొత్తం 3 జలుస్నాన ఘట్టాలను ఏర్పాటు చేశారు. మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో డీఎస్పీ ప్రసన్నకుమార్ 221 మంది సిబ్బంది. 4 క్యూఆర్టీ బృందాలతో బందోబస్తును పర్యవేక్షించనున్నారు. ఎండోమెంట్ అధికారులు భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు.
Also read:

