Navaratri: జనవరి 30 నుంచి శ్యామలా దేవి నవరాత్రులు

రాజశ్యామల లలితాంబికా యొక్క మంత్రిని. మహిమాన్వితమైన ఆ తల్లి నవరాత్రి ఉత్సవాలు జనవరి 30, 2025 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ తల్లిని నవరాత్రులు పూజిస్తే సర్వత్రా విజయాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం. (Navaratri) జ్ఞాన శక్తిగా పూజించబడే దేవత శ్యామల. ఆమె స్వయంగా విద్య కామరూపిణి, ఆమె వివిధ రూపాలు, పరివార దేవతలను కలిగి ఉంటుంది. లఘు శ్యామల రూపంలో చిన్నది కాబట్టి ఆమె మంత్రం చిన్నది. ఈ తల్లిని ప్రసన్నం చేసుకునే మార్గం సులభం.

ఎర్రటి వస్త్రాన్ని ధరించి, చేతిలో వీణను, పువ్వుల నుంచి సేకరించిన తేనెతో నిండిన పుర్రె కప్పును పట్టుకొని ఉంటుంది. ఆమె రంగు ఆకు పచ్చ. ప్రతి ఒక్కరిని తన చిరునవ్వుతోనే మంత్రముగ్ధులను చేస్తుంది. గురువింద గింజలు, ముత్యాలు, బంగారు దండలు ధరించి ఉంటుంది(Navaratri). కొన్ని రూపాలలో నెమలి ఈకలను ధరించి ఉంటుంది. కదంబ వనములో నివసిస్తుంది ఈ తల్లి. ఉచిత, చండాలిని అనే పేర్లు పొందింది. శ్యామాలాదేవికి పూజలు చేస్తే శీఘ్రంగా అనుగ్రహిస్తుంది.మహాకవి కాళిదాసును అనుగ్రహించి అపర పండితుడిని చేసిన తల్లి శ్యామల..ఈమెను మాతంగి అని భైరవి అని కూడా పిలుస్తారు.
శ్రీ లఘు శ్యామలాదేవి నమో నమః

Image

శ్రీ మాత్రే నామ: జగన్మాత కృపాకటాక్ష సిద్ధిరస్తు

Also Read :