ఇంటర్మీడియట్ (Intermediate) విద్యార్థులు హాల్ టికెట్ల కోసం కాలేజీకి వెళ్లాల్సిన అవసరం లేదు. విద్యార్థులు ఇచ్చిన మొబైల్ ఫోన్ నంబర్లకు ఇంటర్ బోర్డు అధికారులు లింక్ పంపిస్తున్నారు. ఆ లింక్ క్లిక్ చేస్తే హాల్టికెట్ వస్తుందని, డౌన్లోడ్ చేసుకోవచ్చు. గతంలో కళాశాలలకే హాల్టికెట్లను పంపేవారు. విద్యార్థులు తమ తమ కళాశాలలకు వెళ్లి హాల్టికెట్లను తీసుకునేవారు. దీంతో కాలేజీ యాజమాన్యాలు ఫీజు బకాయి ఉందని, దానిని చెల్లించే వరకు హాల్ టికెట్లు ఇవ్వబోమని ఇబ్బంది పెట్టేవారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానంతో ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల ఆజమాయిషీకి చెక్ పడింది. ఇవాళ్టి నుంచి ఇంటర్ (Intermediate) మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు మొదలయ్యాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇప్పటికే లింక్స్ వచ్చాయి. వాటిని విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. సెకండియర్ విద్యార్థులకు ఫిబ్రవరి 3 నుంచి ఇంటర్నల్స్ స్టార్ట్ కానున్నాయి. వారికి కూడా లింక్స్ పంపేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో 9.50 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు వెబ్ లింక్ ద్వారా హాల్ టికెట్లు అందుకుంటున్నారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులు హాల్ టికెట్ల కోసం కాలేజీకి వెళ్లాల్సిన అవసరం లేదు. విద్యార్థులు ఇచ్చిన మొబైల్ ఫోన్ నంబర్లకు ఇంటర్ బోర్డు అధికారులు లింక్ పంపిస్తున్నారు. ఆ లింక్ క్లిక్ చేస్తే హాల్టికెట్ వస్తుందని, డౌన్లోడ్ చేసుకోవచ్చు. గతంలో కళాశాలలకే హాల్టికెట్లను పంపేవారు. విద్యార్థులు తమ తమ కళాశాలలకు వెళ్లి హాల్టికెట్లను తీసుకునేవారు. దీంతో కాలేజీ యాజమాన్యాలు ఫీజు బకాయి ఉందని, దానిని చెల్లించే వరకు హాల్ టికెట్లు ఇవ్వబోమని ఇబ్బంది పెట్టేవారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానంతో ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల ఆజమాయిషీకి చెక్ పడింది. ఇవాళ్టి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు మొదలయ్యాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇప్పటికే లింక్స్ వచ్చాయి. వాటిని విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. సెకండియర్ విద్యార్థులకు ఫిబ్రవరి 3 నుంచి ఇంటర్నల్స్ స్టార్ట్ కానున్నాయి. వారికి కూడా లింక్స్ పంపేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో 9.50 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు వెబ్ లింక్ ద్వారా హాల్ టికెట్లు అందుకుంటున్నారు.
Also read:

