పార్లమెంటు బడ్జెట్ (Budget)సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇవాళ కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, పలు పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బడ్జెట్ (Budget) సెషన్ లో ప్రవేశపెట్టబోయే బిల్లుల జాబితాను విపక్ష నేతలకు అందించారు. ఇందుకో కీలకమైన వక్ఫ్ అమెండ్ మెంట్ బిల్లు కూడా ఉండటం గమనార్హం. ఈ పార్లమెంట్‌కు తీసుకురానున్నట్లు కేంద్రం తెలిపింది. విపక్ష ఎంపీలు సహా ఇతరులు మొత్తంగా 44 మార్పులు సూచించగా.. 14 సవరణలను కమిటీ ఆమోదించింది. దానికి సంబంధించిన తుది నివేదికను సిద్ధం చేసి.. తాజాగా లోక్‌సభ స్పీకర్‌కు అందించింది.వక్ఫ్ చట్ట సవరణపై గతంలో కేంద్రం జేపీసీని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.
బిల్లుల జాబితా ఇది
1. బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు, 2024
2. రైల్వేస్ (సవరణ) బిల్లు, 2024
3. విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు. 2014
4. చమురు క్షేత్రాల (నియంత్రణ మరియు అభివృద్ధి) సవరణ బిల్లు, 2024
5. బోయిలర్స్ బిల్లు, 2024
6. గోవా రాష్ట్రం యొక్క అసెంబ్లీ నియోజకవర్గాలలో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య పునర్నిర్మాణం బిల్లు, 2024
7. వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024
8. ముసల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లు, 20249. ది బిల్స్ ఆఫ్ లాడింగ్ బిల్లు, 2024
11. ది క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు, 202412. కోస్టల్ షిప్పింగ్ బిల్లు, 2024
13. మర్చంట్ షిప్పింగ్ బిల్లు, 2024
14. ది ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటరెస్ట్స్ ఇన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్ బిల్లు, 2025
15. త్రిభువన్ సహకరి యూనివర్సిటీ బిల్లు, 2025
16. ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ బిల్లు, 2025
Also read:
- Kumbha Mela: కుంభ మేళాలో అగ్ని ప్రమాదం.. 15 టెంట్లు దగ్ధం
- Intermediate: విద్యార్థుల మొబైల్ కే ఇంటర్ హాల్ టికెట్లు

