కేంద్ర ఆర్థిక మంత్రి (Nirmala Sitharaman) నిర్మలా సీతారామన్‌కు ఇన్వెస్టర్స్పూజలు చేశారు. బడ్జెట్ తమకు అనుకూలంగా ఉండాలని వేడుకున్నారు. మరోవైపు ఇన్కమ్ ట్యాక్స్ శ్లాబ్‌లలో మార్పులొస్తాయేమోనని ఉద్యోగులు ఆశతో ఎదురు చూశారు. కాగా.. టీవీలో నిర్మల ఫొటోకు పూజ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
గురజాడ.. అడుగుజాడ
నిర్మలమ్మ నోట దేశమంటే మట్టికాదోయ్
తెలుగు కవి గురజాడ అప్పారావు సూక్తి ‘దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్’ అంటూ (Nirmala Sitharaman) నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. దేశాభివృద్ధికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని పేద, మధ్యతరగతి లక్ష్యంగా బడ్జెట్ లో కేటాయింపులు చేసినట్టు చెప్పారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పేందుకు గురజాడ పద్యాన్ని ఆమె ప్రస్తావించినట్టు స్పష్టమవుతోంది.
8+8= 0
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025–-26 వార్షిక బడ్జెట్‌పై బీఆర్ఎస్
ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్రం నుంచి 16 మంది ఎంపీలు ఉన్నా ఒక్క రూపాయి కూడా తేలేదని ఆరోపించారు. ఇరుపార్టీల నిర్లక్ష్యం వల్లే బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు కేటాయించలేదన్నారు. ‘8 బీజేపీ ఎంపీలు+8 కాంగ్రెస్ ఎంపీలు= తెలంగాణకు రూ.0 ’ అంటూ ట్వీట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం సిగరెట్ల ధరలు పెరగనున్నాయి. ధూమపానం తగ్గించడమే లక్ష్యంగా పన్నులు పెంచినట్టు తెలుస్తోంది. అదే విధంగా మొబైల్ ఫోన్లు, టీవీలు, ఈవీల ధరలు తగ్గిపోయే అవకాశం ఉంది.
తగ్గనున్న ధరలు
మొబైల్ ఫోన్లు
ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలు
ఎలక్ట్రిక్ వాహనాలు
తోలు వస్తువులు
వైద్య పరికరాలు
క్యాన్సర్ మెడిసిన్
ఫ్రోజన్ చేపలు, చేపల పేస్ట్
క్యాన్సర్ మందులు
వెట్ బ్లూ లెదర్
క్యారియర్-గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్‌లు
12 కీలకమైన ఖనిజాలు
ఓపెన్ సెల్
దేశంలో తయారైన దుస్తులు
ధరలు పెరిగేవి..
ఫ్లాట్ ప్యానెల్ డిస్ ప్లే
సిగరెట్లు
Also read:

