ShareMarket: బడ్జెట్ ఎఫెక్ట్.. షేర్ మార్కెట్ డౌన్

ShareMarket

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కారణంగా స్టాక్ మార్కెట్ (ShareMarket) తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. దేశీయ సూచీలు లాభ, నష్టాలతో దోబూచులాడుతున్నాయి. సానుకూల అంచనాలతో ఉదయం లాభాల్లోకి వెళ్లిన సూచీలు మధ్యాహ్నం 12 ప్రాంతంలో నష్టాల్లోకి జారుకున్నాయి. లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నష్టాల బాట పట్టాయి. ఆ తర్వాత మళ్లీ తేరుకున్నాయి. ప్రస్తుత తీవ్ర అనిశ్చిత్తిలో ఉన్నాయి. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ ఉదయం 100 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభమయ్యే వరకు లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో దాదాపు 400 పాయింట్లు లాభపడి 77, 899 వద్ద గరిష్టానికి చేరింది.

Image అయితే బడ్జెట్ ప్రసంగం మొదలైన కొద్ది సేపటికి నష్టాల్లోకి జారుకుంది. గరిష్టం నుంచి ఏకంగా దాదాపు 900 పాయింట్లు కోల్పోయి 77, 006 వద్దకు చేరింది. ప్రస్తుతం మధ్యాహ్నం 12:20 గంటల సమయంలో 33 పాయింట్లు కోల్పోయి 77, 466 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదులుతోంది. ప్రస్తుతం 13 పాయింట్ల నష్టంతో 23, 474 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌లో హెచ్‌ఎఫ్‌సీఎల్, ప్రెస్టేజ్ ఎస్టేట్, మారుతీ సుజుకీ, గోద్రేజ్ కన్స్యూమర్ (ShareMarket)షేర్లు లాభాల్లో ఉన్నాయి. . ఎస్కార్ట్ కుబోటా, జిందాల్ స్టెయిన్‌లెస్, హుడ్కో, లార్సన్ షేర్లు భారీగా నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ స్వల్ప నష్టాలతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 172 పాయింట్ల నష్టంతో ఉంది.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కారణంగా స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. దేశీయ సూచీలు లాభ, నష్టాలతో దోబూచులాడుతున్నాయి. సానుకూల అంచనాలతో ఉదయం లాభాల్లోకి వెళ్లిన సూచీలు మధ్యాహ్నం 12 ప్రాంతంలో నష్టాల్లోకి జారుకున్నాయి. లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నష్టాల బాట పట్టాయి. ఆ తర్వాత మళ్లీ తేరుకున్నాయి. ప్రస్తుత తీవ్ర అనిశ్చిత్తిలో ఉన్నాయి. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ ఉదయం 100 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభమయ్యే వరకు లాభాల్లోనే కదలాడింది.

ఒక దశలో దాదాపు 400 పాయింట్లు లాభపడి 77, 899 వద్ద గరిష్టానికి చేరింది. అయితే బడ్జెట్ ప్రసంగం మొదలైన కొద్ది సేపటికి నష్టాల్లోకి జారుకుంది. గరిష్టం నుంచి ఏకంగా దాదాపు 900 పాయింట్లు కోల్పోయి 77, 006 వద్దకు చేరింది. ప్రస్తుతం మధ్యాహ్నం 12:20 గంటల సమయంలో 33 పాయింట్లు కోల్పోయి 77, 466 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదులుతోంది. ప్రస్తుతం 13 పాయింట్ల నష్టంతో 23, 474 వద్ద కొనసాగుతోంది.సెన్సెక్స్‌లో హెచ్‌ఎఫ్‌సీఎల్, ప్రెస్టేజ్ ఎస్టేట్, మారుతీ సుజుకీ, గోద్రేజ్ కన్స్యూమర్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. . ఎస్కార్ట్ కుబోటా, జిందాల్ స్టెయిన్‌లెస్, హుడ్కో, లార్సన్ షేర్లు భారీగా నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ స్వల్ప నష్టాలతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 172 పాయింట్ల నష్టంతో ఉంది.

Also read: