సప్తాశ్వర రథా రూఢం
కాశ్యపేయం మహోద్యుతిం
తమోమి సర్వపాపఘ్నం
ప్రణతోస్మి దివాకరం
ఏడు గుర్రాల రథంపై విహరించే ఓ (Suryabhagavanudu) సూర్యభగవానుడా.. కశ్యప ప్రజాపతి కుమారుడా..? మా పాపాలన్నీ హరించేవాడా.. ఓ సూర్యభగవానుడా నీకు ప్రణమిల్లుతున్నాను అని అర్థం. త్రిమూర్తులకు ప్రతిరూపమే (Suryabhagavanudu) సూర్యభగవానుడు అంటారు.
ఆరోగ్యం, ఐశ్వర్యం, పాపహరణం
మాఘశుద్ధ సప్తమినే రథ సప్తమి అంటారు. రథ సప్తమి రోజు సూర్యభగవానుడు తన ఏడు గుర్రాల రథం దిశను మార్చుకుంటాడు. ఆ రోజు నుంచి ఉత్తరం వైపునకు ప్రయాణం ప్రారంభిస్తాడు. లోకానికి ప్రత్యక్ష భగవానుడిగా ఉన్న సూర్యభగవానుడు తన రథం దిశను మార్చుకున్న రోజు అయినందున రథ సప్తమి అంటారు. కొందరు సూర్య జయంతే రథసప్తమి అని కూడా అంటుంటారు. ఏది ఏమైనా సూర్యుడికి సంబంధించిన పండుగ ఇది. సూర్యుడిని ఆరాధించడం వల్ల దీర్ఘకాలిక రోగాలు తొలగిపోయి ఆరోగ్యం లభిస్తుంది. దీనినే అచల సప్తమి అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున సూర్య దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాస వ్రతం చేస్తారు. ఈ దీక్ష వల్ల సకల పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు.
బ్రహ్మ స్వరూపం ఉదయేత్
మధ్యాహ్నంతు మహేశ్వరం
సాయం సంధ్యా విష్ణు రూపం
త్రిమూర్త్యంచ దివాకరమ్
అనేది పురాణోక్తి. త్రిమూర్తుల స్వరూపమే సూర్యభగవానుడు. ఉదయం బ్రహ్మదేవుడిలా.. మధ్యాహ్నం మహేశ్వరుడిగా.. సాయంత్రం విష్ణుమూర్తిలా దర్శనమిస్తూ జగత్తును ఏలుతున్న దివ్యమైన శక్తి స్వరూపమే సూర్యడు
గోమాతకు బెల్లం తినిపించండి
ఉద్యోగం, వ్యాపారాలలో పురోగతి కావాలనుకునే వారు రథసప్తమి రోజున ఎర్రని రంగులో ఉండే గోమాతకు బెల్లం తినిపించాలి. ఎరుపు సూర్యుడికి ప్రతి రూపం. ఎర్రటి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని చాలా మంది నమ్మకం. అందుకే రథసప్తమి రోజున ఎర్రని రంగులో ఉండే గోమాతకు బెల్లం తినిపించడం వల్ల ముక్కోటి దేవతలందరూ సంతోషిస్తారని పురాణాలుచెబుతున్నాయి.
అర్ఘ్యం వదలండి ఇలా..
రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో కొన్ని ఎర్రటి పూలు, ఎండు మిర్చి లోపల ఉండే గింజలు వేయాలి. ‘ఓం సవిత్రే నమః’ అనుకుంటూ తూర్పు వైపు తిరిగి ఆ నీటిని మొక్కలో పోయండి. ఈ పరిహారం పాటించడం వల్ల ప్రమోషన్లు త్వరగా వస్తాయి, ఉద్యోగ జీవితం బాగుంటుందని మాచిరాజు చెప్పారు.
జాతక దోషం పోవాలంటే..
సూర్యభగవానుడికి ఉదయాన్నే గంధం కలిపిన నీటిని అర్ఘ్యంగా సమర్పించడం వల్ల జాతక దోషాలు తొలిగిపోతాయని నమ్మకం. ఇలా అర్థ్యం వదలడం జాతకంలో సూర్యుడి స్థానం బలోపేతం చేస్తుంది. అదృష్టం కలిసి వచ్చి మనోవాంఛలు నెరవేరుతాయి.
Also read:

