ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో (Arsapalli) కొలువై ఉంది ఆదిత్యుడి ఆలయం. సూర్యనారాయణ స్వామి (Arsapalli) ఆలయంలో రథసప్తమి రోజున కిరణాలు ఆదిత్యుడి పాదాలను స్పృషిస్తాయి. ఈ సమయంలో దర్శనం చేసుకుంటే విజయాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మన దేశంలోని సూర్యదేవాలయాలలో ఇది అత్యంత ప్రాచీనమైనది. పద్మ పురాణం ప్రకారం ప్రజల క్షేమం కోసం కస్యప మహర్షి ఈ దేవాలయ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారాలున్నాయి. సాక్షాత్తు ఇంద్రుడే ఈ ఆలయం నిర్మించాడని, దీని పక్కనే ఉన్న కోనేరును ఇంద్ర పుష్కరిణి అని అంటారు. మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మాత్రమే కనిపించే ఈ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు. లేలేత కిరణాలు స్పృశించిన సూర్యనారాయణుడిని దర్శించుకుంటే అన్ని రుగ్మతలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా దృష్టి సంబంధ సమస్యలు దూరమవుతాయని భావిస్తారు.
ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో కొలువై ఉంది ఆదిత్యుడి ఆలయం. సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి రోజున కిరణాలు ఆదిత్యుడి పాదాలను స్పృషిస్తాయి. ఈ సమయంలో దర్శనం చేసుకుంటే విజయాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మన దేశంలోని సూర్యదేవాలయాలలో ఇది అత్యంత ప్రాచీనమైనది. పద్మ పురాణం ప్రకారం ప్రజల క్షేమం కోసం కస్యప మహర్షి ఈ దేవాలయ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారాలున్నాయి. సాక్షాత్తు ఇంద్రుడే ఈ ఆలయం నిర్మించాడని, దీని పక్కనే ఉన్న కోనేరును ఇంద్ర పుష్కరిణి అని అంటారు. మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మాత్రమే కనిపించే ఈ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు. లేలేత కిరణాలు స్పృశించిన సూర్యనారాయణుడిని దర్శించుకుంటే అన్ని రుగ్మతలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా దృష్టి సంబంధ సమస్యలు దూరమవుతాయని భావిస్తారు.

