బీసీలపై (BC) బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కార్చుతున్నారని ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క రోజు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి.. ఆ వివరాలనే బయటపెట్టలేదని గుర్తు చేశారు. వాళ్లకు కులగణను విమర్శించే హక్కు లేదన్నారు. హరీశ్ రావు కావాలనే కులగణన సర్వేపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 56 శాతం బీసీ లు ఉన్నారని చెప్పారు. వాళ్ళ లాగా తాము రిపోర్ట్ లు దాచి పెట్టలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో బీసీ (BC) రిజర్వేషన్లు తగ్గించారని అన్నారు. అప్పుడు 51శాతం బీసీలు ఉంటే ఇప్పుడు 56 శాతం ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీల అభిమానాన్ని చూరగొంటుంటే ఓర్వలేకనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. స్పీకర్ తనకు అధికారంతోనే సభను వాయిదా వేశారని చెప్పారు. కేబినెట్ సమావేశం ఉందన్న ఎల్పీ మినిస్టర్ రిక్వెస్ట్ మేరకు నిర్ణయం తీసుకున్నారని, అనవసర ఆరోపణలు వద్దని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నలుగురే సభలో మాట్లాడి వాయిదా వేసేవారని, ఇప్పుడు హరీశ్ రావు, గంగుల కమలాకర్ కు కూడా టైం ఇస్తామని చెప్పారు.
బీసీలపై బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కార్చుతున్నారని ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క రోజు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి.. ఆ వివరాలనే బయటపెట్టలేదని గుర్తు చేశారు. వాళ్లకు కులగణను విమర్శించే హక్కు లేదన్నారు. హరీశ్ రావు కావాలనే కులగణన సర్వేపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 56 శాతం బీసీ లు ఉన్నారని చెప్పారు. వాళ్ళ లాగా తాము రిపోర్ట్ లు దాచి పెట్టలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో బీసీ రిజర్వేషన్లు తగ్గించారని అన్నారు. అప్పుడు 51శాతం బీసీలు ఉంటే ఇప్పుడు 56 శాతం ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీల అభిమానాన్ని చూరగొంటుంటే ఓర్వలేకనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. స్పీకర్ తనకు అధికారంతోనే సభను వాయిదా వేశారని చెప్పారు. కేబినెట్ సమావేశం ఉందన్న ఎల్పీ మినిస్టర్ రిక్వెస్ట్ మేరకు నిర్ణయం తీసుకున్నారని, అనవసర ఆరోపణలు వద్దని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నలుగురే సభలో మాట్లాడి వాయిదా వేసేవారని, ఇప్పుడు హరీశ్ రావు, గంగుల కమలాకర్ కు కూడా టైం ఇస్తామని చెప్పారు.
Also read:

