తెలంగాణ (Telangana) నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి నిధులు మంజూరు చేయించే బాధ్యత కిషన్ రెడ్డిదేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఇవాళ బహిరంగ లేఖ రాశారు. కిషన్రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండగానే చెన్నై, బెంగళూరు మెట్రో విస్తరణకు ఆమోదం లభించిందని గుర్తు చేశారు. హైదరాబాద్ మెట్రోపై మాత్రం పలుమార్లు విజ్ఞప్తి చేసినా పురోగతి లేదన్నారు. హైదరాబాద్ కు మెట్రో రావడంలో దివంగత కేంద్ర మంత్రులు ఎస్ జైపాల్ రెడ్డి, వెంకటస్వామి పాత్రర ఎంతో ఉందని అన్నారు. సబర్మతి, గంగా పునరుజ్జీవనంపై కిషన్రెడ్డి పలుమార్లు ప్రకటనలు చేశారని, మూసీపై ఎందుకు విషం చిమ్ముతున్నారని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రాజెక్టుల విషయంలో కిషన్రెడ్డి పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టులపై మాట్లాడితే.. మమ్మల్ని అడిగి ఇచ్చారా? అంటూ విమర్శిస్తున్నారని తెలిపారు. తనది అవగాహనా రాహిత్యమని కిషన్రెడ్డి అనడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నకిషన్ రెడ్డి తెలంగాణ (Telangana) ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేయడం సమంజసం కాదన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి నిధులు మంజూరు చేయించే బాధ్యత కిషన్ రెడ్డిదేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఇవాళ బహిరంగ లేఖ రాశారు. కిషన్రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండగానే చెన్నై, బెంగళూరు మెట్రో విస్తరణకు ఆమోదం లభించిందని గుర్తు చేశారు. హైదరాబాద్ మెట్రోపై మాత్రం పలుమార్లు విజ్ఞప్తి చేసినా పురోగతి లేదన్నారు. హైదరాబాద్ కు మెట్రో రావడంలో దివంగత కేంద్ర మంత్రులు ఎస్ జైపాల్ రెడ్డి, వెంకటస్వామి పాత్రర ఎంతో ఉందని అన్నారు.
సబర్మతి, గంగా పునరుజ్జీవనంపై కిషన్రెడ్డి పలుమార్లు ప్రకటనలు చేశారని, మూసీపై ఎందుకు విషం చిమ్ముతున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రాజెక్టుల విషయంలో కిషన్రెడ్డి పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టులపై మాట్లాడితే.. మమ్మల్ని అడిగి ఇచ్చారా? అంటూ విమర్శిస్తున్నారని తెలిపారు. తనది అవగాహనా రాహిత్యమని కిషన్రెడ్డి అనడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నకిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేయడం సమంజసం కాదన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.

Also read:
- Maoist: కామారెడ్డి ఎస్పీ ఎదుట ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
- Farmer Assurance: మూడెకరాల వరకు రైతు భరోసా రిలీజ్

