Srinivas Reddy: మొయినాబాద్ ఠాణాకు ఎమ్మెల్సీ పోచంపల్లి

Srinivas Reddy

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) ఇవాళ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. గత నెల 11న తోల్ కట్ట గ్రామ పరిధిలోని ఫామ్ హౌస్ లో ఎస్ఓటీ దాడులు చేసింది. ఫామ్ హౌస్ లో కోళ్ళ పందాలు ఆడుతున్న వారితో పాటు 64 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే, ఫామ్ హౌస్ ను తాను లీజుకి ఇచ్చానని పోలీసులకు ఎమ్మెల్సీ పోచంపల్లి (Srinivas Reddy) తెలిపారు. లీజు డాక్యుమెంటన్లను సైతం ఇప్పటికే పోలీసులకు అందించారు. పలు డాక్యుమెంట్లపై అనుమానం ఉండటంతో ఆయనను ఇవాళ విచారణకు పిలిచారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో పాటు విచారణకు భూపతి రాజు రాందేవ్ రెడ్డి, రమేష్ రెడ్డిలు హాజరయ్యారు. అయితే, ఇప్పటికే ఎమ్మెల్సీ పోచంపల్లిపై గేమింగ్ యాక్ట్ లోని 3,4సెక్షన్లతో పాటు జంతువుల పట్ల క్రూరత్వం యాక్ట్ 1960లోని సెక్షన్ 11 ప్రకారం కేసు నమోదు చేశారు. ఫాంహౌస్ లో తనిఖీలు చేసిన సమయంలో 46 కోడి కత్తులతో పాటు బెట్టింగ్ కాయిన్స్, కార్డులు, 64 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

Cockfighting racket: Moinabad police issue notice to BRS MLC

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. గత నెల 11న తోల్ కట్ట గ్రామ పరిధిలోని ఫామ్ హౌస్ లో ఎస్ఓటీ దాడులు చేసింది. ఫామ్ హౌస్ లో కోళ్ళ పందాలు ఆడుతున్న వారితో పాటు 64 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే, ఫామ్ హౌస్ ను తాను లీజుకి ఇచ్చానని పోలీసులకు ఎమ్మెల్సీ పోచంపల్లి తెలిపారు. లీజు డాక్యుమెంటన్లను సైతం ఇప్పటికే పోలీసులకు అందించారు. పలు డాక్యుమెంట్లపై అనుమానం ఉండటంతో ఆయనను ఇవాళ విచారణకు పిలిచారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో పాటు విచారణకు భూపతి రాజు రాందేవ్ రెడ్డి, రమేష్ రెడ్డిలు హాజరయ్యారు. అయితే, ఇప్పటికే ఎమ్మెల్సీ పోచంపల్లిపై గేమింగ్ యాక్ట్ లోని 3,4సెక్షన్లతో పాటు జంతువుల పట్ల క్రూరత్వం యాక్ట్ 1960లోని సెక్షన్ 11 ప్రకారం కేసు నమోదు చేశారు. ఫాంహౌస్ లో తనిఖీలు చేసిన సమయంలో 46 కోడి కత్తులతో పాటు బెట్టింగ్ కాయిన్స్, కార్డులు, 64 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

Cockfight Case: Notices Issued to BRS MLC Pochampalli Srinivas Reddy

Also read: