డీలిమిటేషన్ పై కేంద్రం ఇంకా గైడ్ లైన్స్ రూపొందించలేదని, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Sanjay) అన్నారు. నిర్ణయమే తీసుకోనప్పుడు దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. తమిళనాడులో డీఎంకే, కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ లో మాజీమంత్రి జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ నిర్ణయం కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలో భాగమేనన్నారు. ఎవరు అధికారంలో ఉంటే ఆ సీఎంతో బీజేపీ నాయకులు రహస్య భేటీ అవుతారన్న రాజాసింగ్ వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా స్పందిస్తూ… రాజాసింగ్ వ్యాఖ్యలను తాను వినలేదన్నారు. ‘ ఆరు గ్యారంటీలపై చర్చను దారి మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ కు దమ్ముంటే ఆరు గ్యారంటీలపై అఖిలపక్షం నిర్వహించాలి. హైదరాబాద్ లో మిస్ వరల్డ్, తబ్లిగీ జమాతే సంస్థల సమావేశాల పేరుతో వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇవి చేస్తే హైదరాబాద్ బ్రాండ్ పెరుగుతుందా? మీకు దమ్ముంటే డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసులను సీబీఐకి అప్పగించండి. లిక్కర్ కేసులో కేసీఆర్ బిడ్డను ఎట్లా అరెస్ట్ చేశామో లోకమంతా చూసింది. అదేమీ చేయకుండా అన్ని కేసుల్లో కేసీఆర్ ఫ్యామిలీకి ప్రమేయం ఉందని తెలిసినా కనీసం ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నరు.’ అని బండి (Sanjay) అన్నారు.
డీలిమిటేషన్ పై కేంద్రం ఇంకా గైడ్ లైన్స్ రూపొందించలేదని, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నిర్ణయమే తీసుకోనప్పుడు దక్షిణాదికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. తమిళనాడులో డీఎంకే, కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ లో మాజీమంత్రి జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ నిర్ణయం కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలో భాగమేనన్నారు. ఎవరు అధికారంలో ఉంటే ఆ సీఎంతో బీజేపీ నాయకులు రహస్య భేటీ అవుతారన్న రాజాసింగ్ వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా స్పందిస్తూ… రాజాసింగ్ వ్యాఖ్యలను తాను వినలేదన్నారు. ‘ ఆరు గ్యారంటీలపై చర్చను దారి మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ కు దమ్ముంటే ఆరు గ్యారంటీలపై అఖిలపక్షం నిర్వహించాలి. హైదరాబాద్ లో మిస్ వరల్డ్, తబ్లిగీ జమాతే సంస్థల సమావేశాల పేరుతో వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇవి చేస్తే హైదరాబాద్ బ్రాండ్ పెరుగుతుందా? మీకు దమ్ముంటే డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసులను సీబీఐకి అప్పగించండి. లిక్కర్ కేసులో కేసీఆర్ బిడ్డను ఎట్లా అరెస్ట్ చేశామో లోకమంతా చూసింది. అదేమీ చేయకుండా అన్ని కేసుల్లో కేసీఆర్ ఫ్యామిలీకి ప్రమేయం ఉందని తెలిసినా కనీసం ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నరు.’ అని బండి అన్నారు.
Also read:

