America: 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్

America

సుంకాలపై ట్రేడ్ వార్ తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు (America) అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్ పేర్కొంది. ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. ట్రావెల్ బ్యాన్ విధించనున్న మూడు దేశాల జాబితాలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా తదితర దేశాలు ఉన్నాయి. మొదటి జాబితాలో 10 దేశాలున్నాయని ఇందులో ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాన్, క్యూబా, ఉత్తర కొరియా వంటి దేశాలు ఉన్నాయని రాయిటర్స్ పేర్కొంది. ఈ దేశాల పౌరులు  (America) అమెరికాకు వెళ్లలేరు. వీటన్నింటిపై పూర్తి నిషేధం ఉంటుంది. రెండో గ్రూపులో తూర్పు ఆఫ్రికా దేశాలైన ఎరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్ ఉన్నాయి. ఈ దేశాల పౌరులకు పాక్షిక సస్పెన్షన్ వర్తిస్తుంది. ఇది పర్యాటక, స్టూడెంట్ వీసాలతో పాటు కొన్ని మినహాయింపులతో ఇతర వలస వీసాలను కూడా ప్రభావితం చేస్తుంది. అమెరికా 26 దేశాలను మూడవ గ్రూపులో చేర్చింది. జాబితాలోని అన్ని పేర్లను వెల్లడించకపోయినా.. అందులో పాకిస్తాన్, భూటాన్, మయన్మార్ వంటి దేశాలు ఉన్నాయి. ట్రావెల్ బ్యాన్ ఉన్న ప్రభుత్వాలు 60 రోజుల్లోపు లోపాలను సరిచేసే ప్రయత్నాలు చేయకపోతే యూఎస్ వీసాలు జారీ చేయడంపై పాక్షిక నిషేధాన్ని విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

Trump's new travel ban? 41 countries could face visa restrictions | World  News - Business Standard
పూర్తి వీసా సస్పెన్షన్ (ఫేజ్1)
ఆఫ్ఘనిస్తాన్
క్యూబా
ఇరాన్
లిబియా
ఉత్తర కొరియా
సోమాలియా
సూడాన్
సిరియా
వెనిజులా
యెమెన్

పాక్షిక వీసా సస్పెన్షన్ (ఫేజ్ 2)
ఎరిట్రియా
హైతీ
లావోస్
మయన్మార్
దక్షిణ సూడాన్

అమెరికా హైలైట్ చేసిన సమస్యలను పరిష్కరించకపోతే పాక్షికంగా సస్పెండ్ చేయబడే దేశాలు (ఫేజ్ 3)
అంగోలా
ఆంటిగ్వా అండ్ బార్బుడా
బెలారస్
బెనిన్
భూటాన్
బుర్కినా ఫాసో
కాబో వెర్డే
కంబోడియా
కామెరూన్
చాడ్
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో
డొమినికా
ఈక్వటోరియల్ గినియా
గాంబియా
లైబీరియా
మలావి
మౌరిటానియా
పాకిస్తాన్
రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో
సెయింట్ కిట్స్ అండ్ నెవిస్
సెయింట్ లూసియా
సావో టోమ్ అండ్ ప్రిన్సిపీ
సియెర్రా లియోన్
తూర్పు తైమూర్
తుర్క్మెనిస్తాన్
వనవాటు

Trump administration considers travel ban on 41 countries, including  Pakistan - The Hindu

Also read: