డ్రగ్స్ కేసు (Drug case) లో పట్టుబడిన వాళ్ల ఇండ్లకు నీళ్లు , కరెంటు బంద్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రగ్స్ (Drug case) నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కేసులో ఎంత పెద్దవాళ్లున్నా వదలబోమని అన్నారు. ఫాం హౌస్ ల పై దాడులు నిర్వహిస్తామని చెప్పారు. హైదరాబాద్ లో డ్రగ్స్ నియంత్రణకు నార్కొటిక్ అనాలసిస్ బ్యూరో పకడ్బందీగా పనిచేస్తోందని చెప్పారు. 224 మందితో ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాం. టీజీ న్యాబ్ కు 250 కోట్లు ఇచ్చామని వివరించారు. వాటితో వాహనాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించుకోవాలని సూచించామన్నారు.
పాఠశాలల్లో గంజాయి, డ్రగ్స్ బయటికి వస్తే.. యాజమాన్యాలపైనా చర్యలు తీసుకుంటం.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు పాఠశాల యాజమాన్యాలను పిలిచి మీటింగ్ పెట్టి డ్రగ్స్ నియంత్రణపై చెబుతారని అన్నారు. దుబాయ్ లో మృతి చెందిన కేదార్ పోస్టు మార్టి రిపోర్టు కూడా తెప్పించామని చెప్పారు. డ్రగ్స్ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పారు. కేసులో ఎంత పెద్ద వారు పట్టుబడినా వదిలిపెట్టబోమని అన్నారు. అలాగే సిటీలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రతిరోజూ 1,600 కొత్త వాహనాలు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు.
సింగపూర్ లాంటి దేశాల్లో ఒక కొత్త వాహనం కొనుగోలు చేయాలంటే పాత వాహనాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుందని అన్నారు. దీనిపై మనందరం చర్చిద్దామని అన్నారు. ఏదో ఒక దారి కనుగొందామని చెప్పారు. మల్టీ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ పెంచేందుకు చర్యలు తీసుకుందామని సీఎం అన్నారు. లండన్, అమెరికాతో ఎంత ధనవంతుడైనా రైల్వే స్టేషన్లో వాహనం నిలిపేసి మెట్రోలో వెళ్లిపోతారని, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ ఎక్కువగా వాడుతారని అన్నారు. లేదంటే నలుగురు కలిసి ఒకే వాహనంలో వెళ్తారని అన్నారు. అలా అయితే గ్రీన్ చానల్ ఓపెన్ అవుతుందని అన్నారు. ఒక్కరుంటే అందరితో కలిసి ట్రాఫిక్ లో వెళ్లాల్సి ఉంటుంది.. మనం కూడ ఇలాంటి ఒక విధానం తీసుకొద్దామని చెప్పారు.

Also read:

