తాము కూడా రేవంత్ రెడ్డి బట్టలు ఇప్పగలమని, ఆయన దాటిన రేఖలు, తారలు, వాణిల గురించీ మాట్లాడగలమని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఇవాళ అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. రాజకీయాల్లో హద్దులు దాటకూడదని ఇన్నాళ్లూ సంయమనంతో వ్యవహరించామని చెప్పారు. తాము రేవంత్ లాగా మాట్లాడితే ఆయన బయట తిరగలేరని అన్నారు. తాము నోరు విప్పితే సీఎంకు ఇంట్లో అన్నం కూడా పెట్టరని అన్నారు. సాగర్ సొసైటీ, మైహోం భుజా వ్యవహరాల గురించి తాము కూడా మాట్లాడగలమనికేటీఆర్ (KTR) చెప్పారు. రేవంత్ సెల్ఫ్ డ్రైవింగ్ కథలు, ప్రైవేటు కార్ల వివరాలన్నీ చెప్తామని తెలిపారు. ఎక్కువ మాట్లాడితే ఫొటోలు కూడా బయటపెడ్తామని అన్నారు.
బడ్జెట్ కన్నా ముందే అప్రూవర్ గా మారిండు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్ కన్నా ముందే అప్రూవర్ గా మారాడని, రాష్ట్రానికి 70 వేల కోట్ల ఆదాయం తగ్గిందని ఒప్పుకొన్నాడని కేటీఆర అన్నారు. తెలంగాణ రైజింగ్ అంటూ ఈ తగ్గింపు ఏమిటని ప్రశ్నించారు. బంగారం లాంటి రాష్ట్రాన్ని అప్పజెపితే క్యాన్సర్ అని మాట్లాడి సర్వనాశనం చేశారని అన్నారు. ఎవరైనా ఇండ్ల కడతారు కానీ.. కూలగొడతారా..? అని అన్నారు. ప్రభుత్వం పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ పై ద్వేషంతో కాళేశ్వరం బంద్ పెట్టి వ్యవసాయం నాశనం చేశారన్నారు. రేవంత్ వంటి పిచ్చోడి చేతిలో తెలంగాణ రాయి అయిపోయిందని పేర్కొన్నారు. ‘ఢిల్లీకి 40 సార్లు కాకపోతే 400 సార్లు పోయి ప్రధానమంత్రి మోడీ, రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకో, మాకేం సమస్య లేదు, కానీ తెలంగాణకి ఎన్ని నిధులు తెచ్చినావో చెప్పు?’ అని ప్రశ్నించారు.

‘స్టేషన్’ లో బజారు భాష
విలువలని అసెంబ్లీలో చిలకపలుకులు మాట్లాడిన ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్‌లో బజారు భాష మాట్లాడారని కేటీఆర్ అన్నారు. తన మీద 15 కేసులు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు ప్రజాస్వామ్య విలువలు గుర్తొచ్చాయా? అని ప్రశ్నించారు. ఆయనకు ఇవాళ కుటుంబం గుర్తొచ్చిందా అన్నారు. ‘నీతో కలిసి వచ్చినప్పుడు నీ మాటలు చెప్పినప్పుడు యూట్యూబర్లంతా జర్నలిస్టులుగా కనిపించారు. ఇవాళ నిన్ను విమర్శిస్తే జర్నలిస్టులు కారా? ఒకప్పుడు జర్నలిస్టుగా పనిచేసిన వాళ్లు ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను యూట్యూబ్‌లో ఎండగడుతుంటే వాళ్లని జర్నలిస్టులు కాదంటున్నాడు.’ అని కేటీఆర్ అన్నారు.
Also read:

