తగ్గేదేలే..! అంటూ ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన పుష్పరాజ్ (Allu Arjun) విలన్ గా కనిపించబోతున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే పుష్ప–2 బాక్సపీసు వద్ద ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రతిష్ఠాత్మక యష్ రాజ్ ఫిలింస్ రూపొందించనున్న ‘పఠాన్-2’ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ని విలన్ గా నటింపజేసే ప్రయత్నాలు సాగుతున్నాయనేది ఈ గాసిప్ సారాంశం. కింగ్ ఖాన్ షారూఖ్ ‘పఠాన్’ చిత్రంతో 1000 కోట్ల క్లబ్ అందుకున్నాడు. ఇప్పుడు పఠాన్ సీక్వెల్ తో పాన్ ఇండియాలో మరో భారీ విజయాన్ని నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. దీనికోసం పష్పరాజ్ పాత్రలో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ ని విలన్ గా ఎంపిక చేయాలని యష్ రాజ్ బ్యానర్ భావిస్తున్నట్టు కథనాలు వేడెక్కిస్తున్నాయి. పఠాన్ లో జాన్ అబ్రహాం విలన్ గా నటించాడు. అతడి నటనకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు సీక్వెల్ లో పుష్పరాజ్ అలియాస్ బన్ని ఎంట్రీ ఇస్తే అది సౌత్ ఆడియెన్స్ కి మరో లెవల్ ట్రీట్ గా మారుతుంది. తద్వారా దక్షిణాది నుంచి భారీగా వసూళ్లను కొల్లగొట్టాలనే ప్లాన్ యష్ రాజ్ బ్యానర్ కి ఉంది. అందుకే అల్లు అర్జున్ ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తోందనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే విలన్ పాత్రలో నటించేందుకు అల్లు అర్జున్ ఒప్పుకుంటారా..? లేదా..? అన్నది సందేహాస్పదమే..!
తగ్గేదేలే..! అంటూ ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన పుష్పరాజ్ విలన్ గా కనిపించబోతున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే పుష్ప–2 బాక్సపీసు వద్ద ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రతిష్ఠాత్మక యష్ రాజ్ ఫిలింస్ రూపొందించనున్న ‘పఠాన్-2’ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని విలన్ గా నటింపజేసే ప్రయత్నాలు సాగుతున్నాయనేది ఈ గాసిప్ సారాంశం. కింగ్ ఖాన్ షారూఖ్ ‘పఠాన్’ చిత్రంతో 1000 కోట్ల క్లబ్ అందుకున్నాడు. ఇప్పుడు పఠాన్ సీక్వెల్ తో పాన్ ఇండియాలో మరో భారీ విజయాన్ని నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. దీనికోసం పష్పరాజ్ పాత్రలో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ ని విలన్ గా ఎంపిక చేయాలని యష్ రాజ్ బ్యానర్ భావిస్తున్నట్టు కథనాలు వేడెక్కిస్తున్నాయి. పఠాన్ లో జాన్ అబ్రహాం విలన్ గా నటించాడు. అతడి నటనకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు సీక్వెల్ లో పుష్పరాజ్ అలియాస్ బన్ని ఎంట్రీ ఇస్తే అది సౌత్ ఆడియెన్స్ కి మరో లెవల్ ట్రీట్ గా మారుతుంది. తద్వారా దక్షిణాది నుంచి భారీగా వసూళ్లను కొల్లగొట్టాలనే ప్లాన్ యష్ రాజ్ బ్యానర్ కి ఉంది. అందుకే అల్లు అర్జున్ ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తోందనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే విలన్ పాత్రలో నటించేందుకు అల్లు అర్జున్ ఒప్పుకుంటారా..? లేదా..? అన్నది సందేహాస్పదమే..!
Also read:

