Revanth Reddy: మూడు కేటగిరీలుగా యువ వికాసం రుణాలు

Revanth Reddy

రాజీవ్ యువ వికాసం కింద నిరుద్యోగ యువతకు సబ్సిడీపై రుణాలందించనుంది ప్రభుత్వం. దరఖాస్తుల స్వీకరణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇవాళ ప్రారంభించారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు. ఐదు లక్ష మంది యువతకు ఆరు వేల కోట్ల రూపాయల రాయితీని అందించనున్నట్టు (Revanth Reddy) తెలిపారు. మూడు కేటగిరీలుగా రుణాలు మంజూరు చేస్తారు. గరిష్టంగా రూ. 3 లక్షల వరకు రుణం అందించనున్నారు. కేటగిరి 1 కింద లక్ష లోపు రుణాలు ఇస్తారు. ఇలా రుణం పొందిన వారు కేవలం 20 వేలు తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. అంటే 80 % రాయితీ ఇస్తారు. కేటగిరి 2 కింద రూ. 2 లక్షల వరకు రుణం ఇస్తారు. వీళ్లకు 70% రాయితీ ఇస్తారు. అదే విధంగా కేటగిరి 3 కింద రూ. 3 లక్షల వరకు రుణం అందజేస్తారు. వీళ్లు 40% తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. అంటే 60 % రాయితీ లభిస్తుంది. ఈ రుణాల కోసం ఇవాళ్టి నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చే నెల 6 నుంచి మే 31 వరకు దరఖాస్తులను పరిశీలిస్తారు. లబ్ధిదారులుగా ఎంపికైన వారికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజైన జూన్ 2న రుణాలు అందజేస్తారు.

Image

రాజీవ్ యువ వికాసం కింద నిరుద్యోగ యువతకు సబ్సిడీపై రుణాలందించనుంది ప్రభుత్వం. దరఖాస్తుల స్వీకరణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు. ఐదు లక్ష మంది యువతకు ఆరు వేల కోట్ల రూపాయల రాయితీని అందించనున్నట్టు తెలిపారు. మూడు కేటగిరీలుగా రుణాలు మంజూరు చేస్తారు. గరిష్టంగా రూ. 3 లక్షల వరకు రుణం అందించనున్నారు. కేటగిరి 1 కింద లక్ష లోపు రుణాలు ఇస్తారు. ఇలా రుణం పొందిన వారు కేవలం 20 వేలు తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. అంటే 80 % రాయితీ ఇస్తారు. కేటగిరి 2 కింద రూ. 2 లక్షల వరకు రుణం ఇస్తారు. వీళ్లకు 70% రాయితీ ఇస్తారు. అదే విధంగా కేటగిరి 3 కింద రూ. 3 లక్షల వరకు రుణం అందజేస్తారు. వీళ్లు 40% తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. అంటే 60 % రాయితీ లభిస్తుంది. ఈ రుణాల కోసం ఇవాళ్టి నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చే నెల 6 నుంచి మే 31 వరకు దరఖాస్తులను పరిశీలిస్తారు. లబ్ధిదారులుగా ఎంపికైన వారికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజైన జూన్ 2న రుణాలు అందజేస్తారు.

Also read: