Harish Rao: హెచ్ఎండీఏ భూములు తాకట్టుపెట్టి 20వేల కోట్ల అప్పు

Harish Rao

ప్రభుత్వం 50వేల కోట్ల విలువైన భూములు అమ్మేందుకు ప్లాన్​ చేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే (Harish Rao) హరీశ్​ రావు అన్నారు. ఈ ప్రశ్న వేస్తే సభలో చర్చకు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. అసెంబ్లీ లాబీలో ఆయన ఇవాళ మీడియాతో చిట్​ చాట్​ నిర్వహించారు. ‘హెచ్‌ఎండీఏ భూములు తాకట్టుపెట్టి 20వేల కోట్లు అప్పు తెస్తోంది. టీజీఐఐసీ భూముల ద్వారా 10వేల కోట్లు, జీహెచ్​ఎంసీ భూముల ద్వారా 10వేల కోట్లు, హెచ్ఎండబ్ల్యూఎస్ భూముల ద్వారా మరో 10వేల కోట్లు అప్పు తెస్తోంది. ఈ సమస్యలపై చర్చించే దమ్ము ప్రభుత్వానికి లేదు. బీఆర్ఎస్ ప్రశ్నలు సభలో రాకుండా అడ్డుకుంటుంది. సభలో చర్చకు వస్తే వాస్తవాలు భయటపడతాయని ప్రభుత్వం భయపడుతోంది. అందుకే ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తోంద’న్నారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయన్న (Harish Rao) హరీశ్… నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డికి ముందస్తు ప్లాన్ లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. రైతులకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. సిద్దిపేటలో 43వేల మంది అర్హులుంటే… ఇప్పటికీ రుణమాఫీ కాని వారు 22,849 మంది ఉన్నారని చెప్పారు. రైతు భరోసా కూడా 50శాతం మంది రైతులకు రాలేదన్నారు.

T. Harish Rao - Bharatpedia

ప్రభుత్వం 50వేల కోట్ల విలువైన భూములు అమ్మేందుకు ప్లాన్​ చేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​ రావు అన్నారు. ఈ ప్రశ్న వేస్తే సభలో చర్చకు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. అసెంబ్లీ లాబీలో ఆయన ఇవాళ మీడియాతో చిట్​ చాట్​ నిర్వహించారు. ‘హెచ్‌ఎండీఏ భూములు తాకట్టుపెట్టి 20వేల కోట్లు అప్పు తెస్తోంది. టీజీఐఐసీ భూముల ద్వారా 10వేల కోట్లు, జీహెచ్​ఎంసీ భూముల ద్వారా 10వేల కోట్లు, హెచ్ఎండబ్ల్యూఎస్ భూముల ద్వారా మరో 10వేల కోట్లు అప్పు తెస్తోంది. ఈ సమస్యలపై చర్చించే దమ్ము ప్రభుత్వానికి లేదు. బీఆర్ఎస్ ప్రశ్నలు సభలో రాకుండా అడ్డుకుంటుంది. సభలో చర్చకు వస్తే వాస్తవాలు భయటపడతాయని ప్రభుత్వం భయపడుతోంది. అందుకే ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తోంద’న్నారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయన్న హరీశ్… నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డికి ముందస్తు ప్లాన్ లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. రైతులకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. సిద్దిపేటలో 43వేల మంది అర్హులుంటే… ఇప్పటికీ రుణమాఫీ కాని వారు 22,849 మంది ఉన్నారని చెప్పారు. రైతు భరోసా కూడా 50శాతం మంది రైతులకు రాలేదన్నారు.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ అభ్యర్థులకు ఆల్‌ ద బెస్ట్‌: మంత్రి హరీశ్‌ రావు

Also read: