Betting apps: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నటీ నటులపై కేసులు

Betting apps

బెట్టింగ్ యాప్స్ (Betting apps) ప్రమోట్ చేసిన సినీ, బుల్లితెర నటుటపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. నిన్నటి వరకు యూట్యూబర్లు, ఇన్ స్టా ఇన్ ఫ్లూయెన్సర్ల భరతం పట్టిన పోలీసులు ఇవాళ సినీ తారలపై ఫోకస్ పెంచారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ఇవాళ జంగల్ రమ్మీని ప్రమోట్ చేసిన రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్ పై పోలీసులు కేసు ననమోదు చేశారు.

Imageఏ 23 అనే యాప్ ను (Betting apps) ప్రమోట్ చేసిన విజయ్ దేవరకొండపై, యోలో 247 యాప్ ప్రమోట్ చేసిన మంచులక్ష్మిపై, ఫెయిర్ ప్లే లైవ్ యాప్ ప్రమోట్ చేసిన ప్రణీతపై, జీత్ విన్ యాప్ ప్రమోటు చేసిన నిధి అగర్వాల్ పై వీఎల్ బుక్ యాప్ ను ప్రమోట్ చేసిన అనన్య నాగిళ్లపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడుగురు సినిమా తారలపై కేసులు నమోదయ్యాయి.అలాగే యాంకర్లు శ్యామల, శ్రీముఖిలపైనా కేసులు నమోదయ్యాయి. వీరితో పాటు ఇన్ స్టా ఇన్ ఫ్లూయెన్సర్స్ పై, యూట్యూబర్లపై కేసులు నమోదు చేశారు మియా పూర్ పోలీసులు.

Image

మొన్న 11 మంది యూట్యూబర్ల పై కేసు
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం.. అంటూ యాప్స్‌పై ప్రచారం చేస్తున్న 11 మంది యూట్యూబర్లు, ఇన్‌స్టా యూజర్లపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రముఖ యాంకర్లు శ్యామల, శ్రీముఖి కూడా ఉండటం గమనార్హం. వీరిద్దరూ బెట్టింగ్ యాప్స్ ను టాప్ ఆఫ్ కింద ప్రమోట్ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. శ్యామల ఆంధ్ర 365 అనే యాప్ ను ప్రమోట్ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.

శ్రీముఖి - వికీపీడియాశ్రీముఖి వీవీబుక్ అనే యాప్ ప్రమోట్ చేసినట్టు పేర్కొన్నారు. వీరితో పాటు యూట్యూబర్ హర్షసాయి పారిమ్యాచ్ అనే యాప్ ప్రమోట్ చేసినట్టు గుర్తించిన పోలీసులు ఆయనపైనా కేసులు నమోదు చేశారు.
రాణా దగ్గుబాటి జంగల్ రమ్మీ
ప్రకాశ్ రాజ్ జంగల్ రమ్మీ
విజయ్ దేవరకొండ ఏ23

Image
మంచులక్ష్మి యోలో247.కామ్
ప్రణీత ఫెయిర్ ప్లే లైవ్
నిధి అగర్వాల్ జీత్ విన్
అనన్య నాగిళ్ల వీఎల్ బుక్

Image

యూట్యూబర్లు, ఇన్ ఫ్లూయెన్సర్స్, యాంకర్లు
శ్యామల ఆంధ్ర365
శ్రీముఖి వీవీ బుక్
సిరి హనుమంతు తాజ్ 77
వర్షిణి సౌందరరాజన్ ధనీ బుక్365
వసంత్ కృష్ణన్ మామా 247
శోభితా శెట్టి తెలుగు365
అమృతా చౌదరి యెస్365

Image

నయని పావని వీవీబుక్

నేహా పఠాన్ వీఎల్ బుక్
పాండు ఓకే విన్
పద్మావతి జై365
ఇమ్రాన్ ఖాన్ జెట్ ఎక్స్, పారిమ్యాచ్
విష్ణు ప్రియ తాజ్ 777బుక్
హర్షసాయి పారి మ్యాచ్
భవ్య సన్ని యాదవ్ మల్టీపుల్ యాద్స్
టేస్టీ తేజ మల్టీపుల్ యాడ్స్
రితూ చౌదరి మల్టీపుల్ యాడ్స్
బండారు శేషయని సుప్రీత మల్టీపుల్ యాడ్స్

Also read: