Kristina Piskova : ఇండియా సూపర్

Kristina Piskova

భారత్ తనకు ఎంతో బాగా నచ్చిందని, ఇక్కడి భిన్నత్వంలో ఏకత్వం అనేది గొప్ప భావన అని వరల్డ్‌ (Kristina Piskova)  క్రిస్టినా పిస్కోవా అన్నారు. మిస్ వరల్డ్ పోటీలపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తన హృదయంలో ఈ దేశానికి చాలా ప్రాధాన్యత ఉందని మిస్‌ వరల్డ్‌ (Kristina Piskova )  క్రిస్టినా పిస్కోవా అన్నారు. ఇక్కడ స్ఫూర్తి లభిస్తోందని, విలువలు బోధిస్తారని చెప్పారు. ‘‘ఎన్నో భాషలున్నా అంతా ఒక్కటిగా ఉండటంలో ఇండియా స్ఫర్తి దాయకమన్నారు.

A representative of the Czech Republic became the new Miss World  titleholder | УНН

మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు రూ. 55 కోట్లు ఖర్చవుతాయని, ఇందులో 50% ప్రమోటర్స్ ఇస్తారని, మిగతా 50% పర్యాటక శాఖ సమకూర్చుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పర్యాటక శాఖ కూడా స్పాన్సర్స్ ను తీసుకొస్తుందని వివరించారు. ఈ ఈవెంట్ కు వివిధ దేశాల నుంచి మూడు వేల మంది మీడియా ప్రతినిధులు వస్తారని చెప్పారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాల్లో విజిట్ చేసేలా ఏర్పాట్లు చేశామని వివరించారు. పర్యాటక శాఖ చెల్లించే 50%లో 5 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని, మిగతా 22 కోట్ల రూపాయలు స్పాన్సర్ షిప్ దావరా వస్తుందని తెలిపారు. స్పాన్సర్ల ద్వారా నాలుగింతల డబ్బు ప్రభుత్వానికి వస్తుందని జూపల్లి వివరించారు.

KRISTINA PISKOVA CROWNED Miss World | Miss World 2024 Archives - Kannada  News | India News | Breaking news | Live news | Kannada | Kannada News |  Karnataka News | Karnataka News

అందాల పోటీ షెడ్యూల్ ఇది
మే 6,7 తేదీల్లో హైదరాబాద్ కు కంటెస్టెంట్స్
పోటీలకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, హైటెక్స్ వేదికలు
మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఓపెనింగ్ సెరిమనీ
ఓపెనింగ్ సెరిమనీలో పరేడ్ స్టైల్ థీమ్ లో తెలంగాణ ఫోక్ సాంగ్స్, ట్రైబల్ డ్యాన్స్ ఫెర్మార్మెన్స్
31 న హైటెక్స్ లో ఫైనల్ పోటీలు
13 న చౌమహల్లా ప్యాలెస్ లో వెల్కం డిన్నర్.

Kristina Piškova - Nportal
మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ గ్రూప్ వైజ్ గా స్పిరిచ్యువల్, హెరిటేజ్, మెడికల్ టూర్ లో భాగంగా తెలంగాణ లోని పర్యాటక ప్రాంతాలకు
విజిట్ లో భాగంగా చార్మినార్, లాడ్ బజార్, నాగార్జున సాగర్, వరంగల్ లోని కాళోజీ కళాక్షేత్రం, రామప్ప టెంపుల్, యాదగిరిగుట్ట, పోచంపల్లి, అపోలో హాస్పిటల్, యశోద హాస్పిటల్, ఎక్సిపీరియం ఎకో టూరిజం పార్క్ తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, సెక్రటేరియట్, శిల్పారామం సందర్శిస్తారు
జూన్ 2 న తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్, సీఎం లని కలవనున్న మిస్ వరల్డ్ విన్నర్స్.

Christina Piskova: Miss World Krystyna Pyszkova Praises India's Unity in..

Also read: