Telangana: తెలంగాణ నమూనా ఏంటో అర్థమైతలే

Telangana

తెలంగాణ (Telangana) నమూనా అంటే కూల్చివేతలు, కమీషన్లేనా అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్​రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ‘బడ్జెట్లో మూల ధన వ్యయం తగ్గిస్తున్నారు. బడ్జెట్లో సూక్తి ముక్తావళి చాలా ఉంది. కానీ, వాస్తవం చూస్తుంటే కమీషన్ల ప్రభుత్వంలా కనిపిస్తుంది. నిధులు లేక వ్యవస్థలు కూనరిల్లుతున్నాయి. (Telangana) సచివాలయంలో ధర్నాలు ఎన్నడూ చూడలేదు. భూసేకరణ పేరుతో పేద, గిరిజన రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. 15 నెలల్లోనే లక్షా 63వేల కోట్లు అప్పులు చేశారు. కేంద్రం నుంచి పొందిన సాయాన్ని గుర్తుచేస్తే బాగుండేది. 6 గ్యారెంటీలకు నిధులు కేటాయించక పోవడం బాధాకరం. మార్పు పేరుతో మాయమాటలు చెప్పి మోసం చేశారు’ అని మండిపడ్డారు.

Image

గ్రామీణ, రాష్ట్ర రోడ్లకు టోల్‌ తీసుకోమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టంచేశారు. బడ్జెట్​పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ‘బీఆర్ఎస్ హయాంలో కేవలం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కే రోడ్లు వేశారు. మిగతాచోట్ల ఒక్క రోడ్డు వేయలేదు. ఒక్క కాలువ తియ్యలేదు.. కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. దేశంలో రోల్ మోడల్ రోడ్డులు మన దగ్గర ఉన్నాయి. రోడ్ల మీద కమిషన్ లు రావు కాబట్టి బీఆర్ఎస్​వాళ్లు రోడ్లు వేయలేదు. హరీశ్ రావు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40 శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. గ్రామం నుంచి మండలానికి డబుల్‌ రోడ్లు వేయిస్తం. ఆరు నెలలు లేదా మూడు నెలలకు వారికి చెల్లిస్తం. చాలెంజ్‌ చేస్తున్నా రాష్ట్రమంతా తిరిగి చూద్దామా’ అని హరీశ్‌రావుకు సవాల్‌ విసిరారు.

Komatireddy Venkat Reddy ప్రొఫైల్

బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఏ పార్టీకి సభలో మాట్లాడేందుకు ఎన్ని నిమిషాల సమయం వస్తుందో చెప్పారు శాసన సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు. శాసన సభ్యుల లెక్క ఆధారంగా కాంగ్రెస్ పార్టీకి 32 నిమిషాలు, బీఆర్ఎస్ కు 19 నిమిషాలు, బీజేపీకి 4, మజ్లస్ పార్టీకి 4, సీపీఐకి రెండు నిమిషాలు మాత్రమే టైం కేటాయిస్తారని అన్నారు. హరీశ్ రావు గత బడ్జెట్ లెకలు చెబుతూ సమయమంతా వృథా చేస్తున్నారని చెప్పారు. సభలో సభ్యుల ఆధారంగానే తాను లెక్కలు చెప్పినట్టు క్లారిటీ ఇచ్చారు. హరీశ్ రావు 2014 నుంచి జరిగిన బడ్జెట్ లపై గంటల కొద్దీ మాట్లాడుతున్నారని అన్నారు. సభా సమయం వృథా చేయొద్దని సూచించారు.

Profile for Duddilla Sridhar Babu

Also read: