బుద్ధి మాంధ్యం, అజ్ఞానం అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు (Former Minister Harish Rao) చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం రేపాయి. బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు (Former Minister Harish Rao) మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్థిక వృద్ధి రేటు తగ్గిపోతోందని అన్నారు. దేశమంతా ఆర్థిక మాంద్యం ఉందని అబద్ధాలు చెబుతున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఆర్థిక మాంద్యం తెలంగాణలో ఉందంటున్నారని చెప్పారు. ఆర్థిక మాంద్యం ప్రపంచంలో కాదు.. ప్రభుత్వ పెద్దల బుద్ధిలో మాంద్యం ఉందని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోంది. స్టాంప్, రిజిస్ట్రేషన్ ఆదాయం తెలంగాణలో తగ్గింది. తెలంగాణ రైజింగ్ అంటూ ముఖ్యమంత్రి నినాదం ఇస్తున్నారు.
తెలంగాణ రైజింగ్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జోక్యం చేసుకొని బుద్ధి మాంధ్యం అనే పదాన్ని వాడటం కరెక్టు కాదని, దానిని ఉపసంహరించుకోవాలని, అలా మాట్లాడటం సభ హూందా తనాన్ని తగ్గిస్తుందని చెప్పారు. సూచించారు. దీనికి హరీశ్ రావు స్పందిస్తూ.. ‘ముఖ్యమంత్రి గారు బట్టలూడదీసి కొడ్తం అని ఇదే సభలో అంటే వారికి మీరెందుకు చెప్పలేదు’ అని ప్రశ్నించారు. ‘నేను బుద్ధి మాంద్యం అంటే మీ ఆలోచన విధానంలో తప్పుందీ’ అన్న.. అని అన్నారు. అది తప్పయితదా…? వారి విజ్ఞతకే వదిలేస్తున్నా.! అన్నారు.. హరీశ్ రావు సభలో రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘ముఖ్యమంత్రిని ఉద్దేశించి కూడా అజ్ఞానం వల్ల అన్నారు. అంటే సీఎంకు జ్ఞానం లేదనా..? మాకెవరికీ జ్ఞానం లేదనా ..? అంటూ ప్రశ్నించారు.
సభానాయకుడిని పట్టుకొని మాట్లాడే మాటలు కరెక్టేనా..? అన్నారు. బుద్ధిమాంద్యం ఉందని మా అందరి గురించి మాట్లాడుతుంటే స్పీకర్ గారు చెప్తా ఉంటే సభాపతి గారితోనూ వాదనకు దిగుతున్నారు.’ భాష వాడేటప్పులు పరిధి దాటి మాట్లాడొద్దు అన్నారు. ఇదే సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో రోడ్లు వేయలేదని, కేవలం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ సెగ్మెంట్లకే వేసుకున్నారని అన్నారు. కమీషన్లు రావలనే తమ జిల్లాలకు రోడ్లు వేయలేదని అన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జోక్యం చేసుకుంటూ.. ‘మా వికారాబాద్ జిల్లాలో రోడ్లు సక్కగ లేక పిల్లనిచ్చేటట్టు లేరు’ అని అన్నారు. హరీశ్ రావు కృష్ణ జలాల అంశాన్ని ప్రస్తావించడంతో మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకొని నీళ్లకు నీళు.. పాలకు పాలు తర్వాత చర్చిద్దామని అన్నారు.
బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఏ పార్టీకి సభలో మాట్లాడేందుకు ఎన్ని నిమిషాల సమయం వస్తుందో చెప్పారు శాసన సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు. శాసన సభ్యుల లెక్క ఆధారంగా కాంగ్రెస్ పార్టీకి 32 నిమిషాలు, బీఆర్ఎస్ కు 19 నిమిషాలు, బీజేపీకి 4, మజ్లస్ పార్టీకి 4, సీపీఐకి రెండు నిమిషాలు మాత్రమే టైం కేటాయిస్తారని అన్నారు. హరీశ్ రావు గత బడ్జెట్ లెకలు చెబుతూ సమయమంతా వృథా చేస్తున్నారని చెప్పారు. సభలో సభ్యుల ఆధారంగానే తాను లెక్కలు చెప్పినట్టు క్లారిటీ ఇచ్చారు. హరీశ్ రావు 2014 నుంచి జరిగిన బడ్జెట్ లపై గంటల కొద్దీ మాట్లాడుతున్నారని అన్నారు. సభా సమయం వృథా చేయొద్దని సూచించారు.
Also read:

