పదేండ్లపాటు మంత్రిగా పని చేసిన హరీశ్‌రావు సభలో ఇన్ని అబద్ధాలు చెబుతారనుకోలేదని దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్ (Balu Naik) అన్నారు. పాలన అంటే.. గతంలో ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా బొక్కేయడం కాదు అంటూ ఫైర్అయ్యారు. పరీక్ష పేపర్ల లీకేజీతో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను అడ్డగోలు సంపాదన కేంద్రాలుగా మార్చడం కాదు పాలన అంటే అని సెటైర్లు వేశారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా (Balu Naik) బాలూ నాయక్మాట్లాడుతూ ‘హరీశ్‌రావు స్పీచ్వాస్తవాలకు దూరంగా ఉంది. పరివారానికి, సంతానానికి లిక్కర్ స్కాముల విద్య నేర్పడం కాదు పరిపాలన అంటే. అధికారం అడ్డు పెట్టుకుని ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కాదు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మహిళలను మీటింగ్‌లకు వాడుకోవడం తప్ప వారిని వృద్ధిలోకి తీసుకొచ్చే ఆలోచన చేయలే. ఆర్టీసీ సిబ్బంది నిరసనలు తెలిపితే ఉద్యోగాలను తొలగించారు. పండుగలకు పంపిణీ చేసిన చీరలు పొలాలకు పరదాలు అయ్యాయి. మా ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. కానీ, హరీశ్ రావు ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నరు’ అని బాలూనాయక్ అన్నారు.
గ్రామీణ, రాష్ట్ర రోడ్లకు టోల్ తీసుకోమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టంచేశారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ‘బీఆర్ఎస్ హయాంలో కేవలం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కే రోడ్లు వేశారు. మిగతాచోట్ల ఒక్క రోడ్డు వేయలేదు. ఒక్క కాలువ తియ్యలేదు.. కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. దేశంలో రోల్ మోడల్ రోడ్డులు మన దగ్గర ఉన్నాయి. రోడ్ల మీద కమిషన్ లు రావు కాబట్టి బీఆర్ఎస్వాళ్లు రోడ్లు వేయలేదు. హరీశ్ రావు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40 శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు వేయిస్తం. ఆరు నెలలు లేదా మూడు నెలలకు వారికి చెల్లిస్తం. చాలెంజ్ చేస్తున్నా రాష్ట్రమంతా తిరిగి చూద్దామా’ అని హరీశ్‌రావుకు సవాల్ విసిరారు.
Also read:

