Assembly: అసెంబ్లీలో యాగం పంచాది

Assembly

అసెంబ్లీ (Assembly) లో యాగం పంచాది నెలకొంది. బడ్జెట్ పై చర్చ సందర్భంగా రోడ్ల అంశంపై అధికార, ప్రతినేత నేతల మాట్లాడారు. ఈసందర్భంగామంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్​రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రశాంత్​ రెడ్డి మాట్లాడుతూ ‘పదేండ్లలో బీఆర్ఎస్ పాలనలో డబుల్ రోడ్లు 8000 కిలోమీటర్లు, నాలుగు లైన్ల రోడ్లు 600 కిలోమీటర్లు వేశామని ప్రశాంత్​రెడ్డి సభలో తెలిపారు. 17వేల కిలో మీటర్లకు 23 వేల కోట్లు ఖర్చు అవుతాయి. మొత్తం ఖర్చులో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.

Vemula Prashanth Reddy | MLA | Balkonda | Nizamabad | TRS | Minister for  Roads & Buildingsప్రైవేట్ పెట్టుబడులతో కొత్త రోడ్లు వేస్తామని సర్కార్ అంటుంది. ప్రైవేట్ వ్యక్తులు అంటే ఎవరు? ఎవరి ఆధ్వర్యంలో రోడ్లు వేస్తారు. ఇప్పటికీ ఏడాదిన్నర కాలం పూర్తయింది. మూడున్నర సంవత్సరాలలో 17వేల కిలో మీటర్లు ఎలా వేస్తారు? అని ప్రశ్నించారు.రోడ్లు వేయలేదని మా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. నా క్యారెక్టర్ అశాశినేషన్ చేయకండి అని సూచించారు. దీని కోమటిరెడ్డి ఘాటుగా స్పందిస్తూ ‘మాజీ ఆర్ అండ్ బీ మంత్రి చేసిన ఘనకార్యం మాకు తెలుసు. (Assembly)సెక్రటేరియట్​కట్టాలే.. యాగాలు చేసుడే మీకు తెలుసు. వాళ్ల లెక్క ప్రగతిభవన్​, ఫామ్​హౌస్​లో చండీయాగం చూసుకువాడం మాకు తెల్వదు. నాకేమో యాగాలు, యజ్ఞాలు లేకపాయే. రోడ్లు వేయాలే.. బ్రిడ్జిలు కట్టాలే.. ఇదే నా పని. మేం పనిచేస్తం.. బీఆర్ఎస్ నేతల్లాగా మాట్లాడలేం. పదేండ్లలో 3900 కోట్లు ఆర్ అండ్ బీకి కేటాయించగా 4వేల కోట్లు లోన్స్ తీసుకున్నారు. హరీశ్​ రావు, ప్రశాంత్ రెడ్డి వస్తారా చూపిస్తం’ అని సవాల్​విసిరారు.

బంగారు తెలంగాణను నాశనం చేసిండ్రు
‘ మట్టి, బీటీ, లేకుండా కొత్త రోడ్ల నిర్మాణం ఉంటుంది. వచ్చే డిసెంబర్ నాటికి రోడ్లు అంటే ఇలా ఉండాలని ప్రజలకు అర్థం అవుతాయి. రీజినల్ రింగ్ రోడ్డు వేస్తే 50శాతం తెలంగాణ కవర్ అవుతుంది. పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్, ఔటర్ రింగ్ రోడ్డు వేసింది కాంగ్రెస్ పార్టీనే. ఉద్యోగాలు ఇచ్చాం అంటే మేము రెడీ చేసాం అంటున్నారు.. మరి అంతా రెడీ చేసి సర్టిఫికెట్ లు ఎందుకు ఇవ్వలేదు. బంగారు తెలంగాణ అని అంతా నాశనం చేశారు’ అని కోమటిరెడ్డి మండిపడ్డారు.

Also read: