హోలీ పండగ సెలవుల సందర్భంగా సెలవుపై వెళ్లిన ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ(Allahabad) ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం.. మంటలు ఆర్పే క్రమంలో భారీ మొత్తంలో నగదు బయటపడ్డాయి. లెక్కకు మించి నగదు ఉండటంతో న్యాయమూర్తికి, ఆయన కుటుంబ సభ్యులకు ఫైర్ అధికారులు, పోలీసులు ఫోన్ చేశారని తెలుస్తోంది. నగదుకు సంబంధించిన వివరాలు తెలియకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం జస్టిస్ వర్మను బదిలీ చేయాలని నిర్ణయించింది. నగదు దొరకడంపై ప్రధాన న్యాయమూర్తి చాలా తీవ్రంగా దృష్టి సారించారని, ఐదుగురు సభ్యుల కొలీజియం జస్టిస్ వర్మ బదిలీపై ఏకగ్రీవంగా అంగీకరించిందని అధికార వర్గాలు తెలిపాయి.(Allahabad) ఇదిలా ఉండగా నగదు రికవరీపై జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంకా స్పందించలేదు.
Also Read :

