Chandrababu Naidu:చంద్రబాబుకు బెయిల్

చంద్రబాబుకు బెయిల్

అనారోగ్యం రీత్యా మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
నచ్చిన ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవచ్చు
సాక్ష్యులను బెదిరించవద్దు.. కేసును ప్రభావితం చేయొద్దు
తీర్పు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు
అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయి రాజహేంద్రవరం జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు కు ఏపీ హైకోర్టు నాలుగు వారాల మధ్యంర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలరీత్యా చికిత్స కోసం మధ్యంతర బెయిలు ఇవ్వాలని చంద్రబాబు అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై నిన్న న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు బెంచ్ పూర్తి స్థాయి విచారణ చేపట్టి ఇవాళ తీర్పు వెలువరించింది. నవంబర్‌ 10న రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏసీబీ కోర్టు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్‌ 9న నంద్యాలలో చంద్రబాబు (chandrababu naidu)ను సీఐడీ అరెస్ట్‌ చేసింది. అనంతరం ఆయనను విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. దీంతో చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. 52 రోజులుగా ఆయన జైలులో ఉన్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో చంద్రబాబు (chandrababu naidu)ఈ సాయంత్రం విడుదలయ్యే అవకాశముంది.

53 రోజులు.. యూటీ నంబర్ 7691 (పేజీ 1 బాక్స్)
స్కిల్ స్కాం కేసులో సెప్టెంబర్ 9న అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు (chandrababu naidu)53రోజుల పాటు అంటర్ ట్రయల్ ఖైదీగాజైలు జీవితం గడిపారు. రాజమహేంద్రవరం జైలులో యూటీ 7691 బ్యారక్ ను ఆయనకు కేటాయించారు. సీఐడీ అధికారులు ఆయనను ఒక సారి రెండు రోజుల పాటు ప్రశ్నించారు. దీంతో పాటు ఫైబర్ నెట్, అంగల్లు లో పోలీసులను రెచ్చగొట్టిన కేసుల్లో చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ ఏపీ పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. లిక్కర్ అనుమతుల స్కాంపై సీఐడీ నిన్న కేసు నమోదు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో బాబుకు ముందస్తు బెయిల్ మంజూరైంది.

Read More: