మార్చి 30వ తేదీ గురువారం జరిగిన శ్రీరామనవమి(SRIRAMANAVAMI) వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లో మెట్ల బావి కూలి 11 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా దువ్వ వేణుగోపాల స్వామి ఆలయంలో సీతారామలు కల్యాణోత్సవం కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదు. దీంతో ఏపీ అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో శ్రీరామనవమి (SRIRAMANAVAMI) సందర్భంగా దర్శనానికి వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మెట్లబావి కూలిన ఘటనలో 11 మంది చనిపోయారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 11 మంది మృతదేహాలు బయటకు తీశారు. 19 మందిని సిబ్బంది సురక్షితంగా రక్షించామని ఇండోర్ కలెక్టర్ డాక్టర్ టీ ఇళయరాజా వెల్లడించారు. ఈ ఘటనపై మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. గాయపడిన వారికి 50 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు.
దువ్వలో ఘోర అగ్ని ప్రమాదం.. కాలిన చలువ పందిళ్లు
Andhra Pradesh Temple Fire: పశ్చిమగోదావరి జిల్లా దువ్వ శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. వేణుగోపాల స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలకు ఏర్పాటు చేసిన చలువ పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయం ప్రాంగణంలో గురువారం శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రమాదవశాత్తు చలువ పందిళ్లు మంటకు ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు.
ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మంటు ఎగిసి పడటంతో భక్తులు భయాందోళనలతో బయటికి పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణ నష్టం కలుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు, షార్ట్ సర్క్యూట్ ఎలా ఏర్పడింది..? అనే కోణంలో పోలీసులు, అధికారులు దర్యాప్తు చేస్తున్నార
ఏపీలో ప్రశాంతంగా శ్రీరామ నవమి వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ఊరూరా సీతారాముల కల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించారు. చలువ పందిళ్లు వేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ముత్యాల పందిరిలో సీతరాముల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అయోధ్య రామయ్య జనకరాజు పుత్రి.. కోమలాంగి సీతాదేవి మెడలో మూడు ముళ్ల వేశాడు. ఈ దృశ్యాన్ని కనులారా వీక్షించిన భక్తలు ఆనంద పరవశానికి లోనయ్యారు.
అనంతరం వడపప్పు, పానకాన్ని అందరికీ పంచి పెట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు. తిరుమల, తిరుపతి, శ్రీశైలం, అన్నవరం, రాజమండ్రి, విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరు, మార్కాపురం, పొదిలి, ఒంగోలు, తుని, ఏలూరు తదితర ప్రాంతాల్లో సీతారాముల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మరొకిన్ని చోట్ల రాత్రి పూట హరికథ, బుర్రకథ తదితర కార్యక్రమాలకోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
Also Read
DELHI:ఢిల్లీ బాట పట్టిన తెలంగాణ
వైభవంగా సిద్ధరామేశ్వరుడి కల్యాణం