CBN: వరద కష్టాలు భరిస్తున్నం నీళ్లు వాడుకుంటం!

CBN

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు CBN బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సముద్రంలో వృథాగా కలిసిపోతున్న వరద జలాలను వినియోగించడమే తమ CBN ఉద్దేశమని తెలిపారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమరావతిలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ – ఎగువ రాష్ట్రాలు వరదల సమయంలో నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా కష్టనష్టాలు ఎదుర్కొంటున్నామని, అదే వరద జలాలను వినియోగించుకోవడంలో ఎటువంటి తప్పులేదని అన్నారు.

Image

పోలవరం ప్రాజెక్టు పురోగతి

  • 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

  • ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ₹12,157 కోట్లు విడుదల చేసిందని, సకాలంలో పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

జల జీవన్ మిషన్ లక్ష్యం

  • 2028 నాటికి రాష్ట్రంలోని ప్రతి గడపకు సురక్షిత తాగునీరు అందించనున్నామని తెలిపారు.

రాయలసీమ & ఇతర ప్రాజెక్టులు

  • రాయలసీమను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో హంద్రీ-నీవా కాల్వల వెడల్పు పనులు రికార్డు స్థాయిలో పూర్తి చేశామని అన్నారు.

  • ఈ ఏడాది ఉత్తరాంధ్ర, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ప్రకటించారు.

  • ప్రకాశం జిల్లాను కరవు నుంచి బయటపడేసే వెలుగొండ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇస్తున్నామని, వచ్చే ఏడాది జూలై నాటికి సాగునీరు అందించేలా పనులు జరుగుతున్నాయని చెప్పారు.

గ్రామీణాభివృద్ధి & మౌలిక సదుపాయాలు

  • గ్రామీణ ప్రాంతాల్లో 4,000 కి.మీ సీసీ రోడ్లు, 250 కి.మీ బీటీ రోడ్లు నిర్మించామని తెలిపారు.

  • ఆరోగ్యాంధ్రప్రదేశ్ విధానంతో వైద్య రంగాన్ని అభివృద్ధి చేశామని, సీఎం సహాయనిధి ద్వారా ఇప్పటివరకు ₹552 కోట్లు అందించామని వెల్లడించారు.

భవన నిర్మాణ సౌలభ్యం

  • భవన అనుమతుల ప్రక్రియను సులభతరం చేశామని, 100 గజాల లోపు స్థలాల్లో ఎలాంటి బిల్డింగ్ ప్లాన్ లేకుండానే ఇళ్లు నిర్మించుకునే వీలు కల్పించామని తెలిపారు.

Also read: