PAWAN KALYAN: సాయంలోనూ రాజకీయమా?

pavan kalyan

PAWAN KALYAN: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై జనసేనాని పవన్ కల్యాణ్ (Janasena President Pawan Kalyan) ఫైర్ అయ్యారు. తన దైన శైలిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Janasena President Pawan Kalyan) విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 3 వేల మంది కౌలురైతులు ఆత్మహత్యకు పాల్పడ్డా.. జగన్‌ ప్రభుత్వంలో స్పందన కరువైందంటూ ఫైర్ అయ్యారు. రైతులకు సాయం చేయడంలోనూ సామాజిక వర్గం కోణం ఏమిటగని జనసేన ప్రెసిడెంట్ పవన్ కల్యాణ్​ ప్రశ్నించారు.

ఏపీలో 80 శాతం వరి పంట కౌలు రైతుల సేద్యం నుంచి వస్తున్నదే అని పవన్‌ అన్నారు. రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీతో పవన్ మార్చి 30, 2023 రోజున సమావేశమయ్యారు. కౌలు రైతుల స్థితిగతులపై పవన్‌కు ప్రతినిధులు నివేదిక అందచేశారు. రైతాంగ కష్టాలపై త్వరలో జనసేన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోందని, రైతు సమస్యలపై జనసేన పోరాడుతోందని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

ఇటీవల చనిపోయిన బిడ్డను తరలించేందుకు అంబులెన్స్ అడిగితే ఇవ్వని పాషాణ ప్రభుత్వమని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఆస్పత్రులను మెరుగుపరచని వైసీపీ పెద్దలు, విశాఖను రాజధానిగా అభివృద్ధి చేసేస్తారట అని పవన్ విమర్శించారు. బిడ్డ మృతదేహంతో 120 కిలోమీటర్ల దూరం మోటార్ సైకిల్‌పై వెళ్లిన ఆ గిరిజన దంపతులకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కేజీహెచ్‌లో గిరిజనులకు సాయపడేందుకు ఎస్టీ సెల్ ఉన్నా, ఆసుపత్రిలో ఉన్నతాధికారులు ఉన్నా పట్టించుకోకపోవడం అమానవీయమని పవన్ అన్నారు.

ఆస్పత్రుల నిర్వహణ, ప్రజారోగ్యంపై పాలకులు ఎంత శ్రద్ధ చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఈ తరహా ఘటన ఆంధ్రపప్రదేశ్ లో మొదటిది కాదని, కొద్ది నెలల కిందటే తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి బిడ్డ మృతదేహాన్ని తరలించేందుకు ఓ తండ్రిపడ్డ ఆవేదనను ఏపీ ప్రజలు మరచిపోలేదన్నారు. మచిలీపట్నం సముద్ర తీరంలో ఓ బాలుడు చనిపోతే ఆ బిడ్డ మృతదేహాన్ని బంధువులు బైక్ మీద తీసుకువెళ్లారని, ఆసుపత్రుల్లో ఉన్న మహాప్రస్థానం వాహనాల పథకం ఏమైంది? అని జనసేనాని ప్రశ్నించారు.

Also Read

FACEBOOK BLUE TICK: బ్లూ టిక్ చాలా కాస్ట్లీ గురూ..!

SRIRAMANAVAMI:శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి.. 11 మంది దుర్మరణం