RGV: పిఠాపురం బరిలో ఆర్జీవీ

RGV

అమరావతి: ఏపీలో పొలిటికల్ హీట్ రోజురోజుకూ పెరుగుతోంది. వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ (RGV) ఎక్స్ వేదికగా ఓ పొలిటికల్ బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేయనున్నట్లు స్వయంగా ప్రకటించారు. అది కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్​ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన గంట వ్యవధిలో ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

‘సడన్ గా నిర్ణయం తీసుకున్నా… నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశాడు రాంగోపాల్ వర్మ. (RGV)ఆర్జీవీ ఎప్పటిలాగానే పవన్ కల్యాణ్​ పై సెటైరికల్ గా ఈ ట్వీట్ చేశాడా లేక నిజంగానే పోటీకి దిగుతున్నాడా? అన్న చర్చ సోషల్ మీడియా వేదికగా మొదలైంది.

 

Also read: