YS Sharmila: రాజకీయాల్లోకి వైఎస్ రాజారెడ్డి ఎంట్రీ

YS Sharmila

ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి అవసరమైనప్పుడు అడుగుపెడతారని స్పష్టం చేశారు. (YS Sharmila)

Image

కర్నూల్ ఉల్లి మార్కెట్‌ సందర్శించిన షర్మిల, రైతుల సమస్యలను ప్రస్తావించారు. గతేడాది క్వింటా ఉల్లి ధర రూ. 4500 కాగా, ప్రస్తుతం రూ. 600 కూడా పలకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా రూ. 1200కి ఉల్లి కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నా, రైతుల నుంచి ఆ ధరకు ఎక్కడా కొనుగోలు జరగడం లేదని ఆరోపించారు. రైతులు బలవంతంగా రూ. 600కే అమ్ముకోవాల్సి వస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీశారు.

Also read: