Tirumala: శ్రీవారి సేవలన్నీ రథసప్తమి రోజే

Tirumala

అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడైన తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా విరాజిల్లుతున్నాడు. ఆ దేవదేవుడికి ప్రతి ఏటా ఆశ్వీయుజ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తొమ్మిది రోజుల పాటు మలయప్ప స్వామి శ్రీదేవీ, భూదేవీ సమేతుడై వివిధ రకాల సేవల్లో భక్తులను అనుగ్రహిస్తాడు. శేషాద్రివాసుడికి శేషవాహనసేవ.. విశ్వరూపునకిదే అశ్వవాహన సేవ.. రామావతారిగా హనుమంత సేవ అంటారు. ఇలా అనేక రకాల సేవలతో తరతరాలుగా నిత్య వైకుంఠంగా విరాజిల్లుతోంది తిరుమల దివ్యక్షేత్రం. రథసప్తమికి తిరుమలకు ఓ విడదీయలేని బంధం ఉంది. (Tirumala) తిరుమలేశుడు రథసప్తమి రోజున బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే సేవలన్నీ ఒక్క రథసప్తమి రోజే అందుకుంటాడు. ఇందుకోసం తిరుమల సిద్ధమైంది. సేవలకు పల్లకీలూ రెడీ అయ్యాయి. మంగళవారం ఉదయత్పూర్వం నుంచి మలయప్ప, శ్రీదేవీ, భూదేవీ సమేతుడైన భక్తులను అనుగ్రహించనున్నారు. రథ సప్తమి నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ.. విశ్వరూపుడి సేవలన్నీ నయనానందకరంగా చూసే భాగ్యం ఈ ఒక్క రోజే కలుగుతుంది.

Image

 

అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా విరాజిల్లుతున్నాడు. ఆ దేవదేవుడికి ప్రతి ఏటా ఆశ్వీయుజ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తొమ్మిది రోజుల పాటు మలయప్ప స్వామి శ్రీదేవీ, భూదేవీ సమేతుడై వివిధ రకాల సేవల్లో భక్తులను అనుగ్రహిస్తాడు. శేషాద్రివాసుడికి శేషవాహనసేవ.. విశ్వరూపునకిదే అశ్వవాహన సేవ.. రామావతారిగా హనుమంత సేవ అంటారు. ఇలా అనేక రకాల సేవలతో తరతరాలుగా నిత్య వైకుంఠంగా విరాజిల్లుతోంది తిరుమల దివ్యక్షేత్రం. రథసప్తమికి తిరుమలకు ఓ విడదీయలేని బంధం ఉంది. తిరుమలేశుడు రథసప్తమి రోజున బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే సేవలన్నీ ఒక్క రథసప్తమి రోజే అందుకుంటాడు. ఇందుకోసం తిరుమల సిద్ధమైంది. సేవలకు పల్లకీలూ రెడీ అయ్యాయి. మంగళవారం ఉదయత్పూర్వం నుంచి మలయప్ప, శ్రీదేవీ, భూదేవీ సమేతుడైన భక్తులను అనుగ్రహించనున్నారు. రథ సప్తమి నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ.. విశ్వరూపుడి సేవలన్నీ నయనానందకరంగా చూసే భాగ్యం ఈ ఒక్క రోజే కలుగుతుంది.

Image

Also read: