Vemulawada: 20న వేములవాడకు సీఎం

కార్తీకమాసం సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డి ఈ నెల 20న రాజన్న దర్శనం కోసం వేములవాడకు (Vemulawada) వస్తున్నట్లుగా మంత్రి పొన్నం ప్రభాకర్​తెలిపారు. ఇవాళ వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్​ దర్శించుకున్నారు. స్వామివారికి అభిషేకం నిర్వహించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. (Vemulawada) టెంఫుల్​కు వచ్చిన మంత్రి పొన్నంకు ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే రాజన్న ఆలయ అభివృద్ధి, మాస్టర్​ప్లాన్, పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు, టెక్స్ టైల్స్ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లిన్నట్లుగా ఆయన తెలిపారు. ‘ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ధనిక రాష్ట్రంగా ఉండే.. బీఆర్ఎస్​ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. బీఆర్ఎస్​ హయంలో రూ. లక్ష రుణమాఫీకి ఆరు కిస్తీల్లో చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకకాలంలో రూ. 2 లక్షల రుణ మాఫీ చేశాం. త్వరలోనే రూ. 2 లక్షల కు పైగా ఉన్న వారికి మాఫీ చేస్తాం. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నం. మిల్లర్లు రూ. 20 కోట్లు ధాన్యం డబ్బు కట్టడం లేదు. అలాంటి వారికి ధాన్యం ఇవ్వడం లేదు.

Image

మిల్లర్లు డబ్బులు కట్టాలి. రైతులకు ఇబ్బంది పెట్టద్దు. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నం. భవిష్యత్ లో రైతులు సన్నరకం వరి సాగుపై దృష్టి పెట్టాలి. 19 వరంగల్ సభకు సీఎం వస్తున్నారు. ప్రజాపాలనలో పూర్తి స్వేచ్ఛ ఉంది. గత ప్రభుత్వంలో అధికారులు, ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయం చెప్పడానికి లేదు. ప్రజలు నిరసన వ్యక్తం చేయడానికి లేదు. ఒక ఐపీఎస్​ అధికారిపై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్​ చేస్తే కిషన్​ రెడ్డి తప్పు అనడం ఏంటీ..? సెంట్రల్​మినిస్టర్​ కిషన్​రెడ్డికి మంత్రిగా అర్హత లేదు కలెక్టర్ పై దాడిచేసే వారిని అరెస్టు చేయొద్దని చెబుతున్నారు. కేటీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారు. అరెస్ట్​ చేస్తే సానుభూతి కోసం చూస్తున్నారు. ప్రతిపక్ష నాయకులకు నిరసనలు, అభిప్రాయాలు ప్రజాస్వామ్య వేదికల ద్వారా చెప్పవచ్చు. ధర్నా చౌక్​లు, మీడియా, శాసనసభలు ఉన్నాయి. అఖిరికి న్యాయస్థానాలు కూడా ఉన్నాయి. ఇలాంటి దాడులు చేసి, ప్రజలను రెచ్చగొట్టడం ఎందుకు..? బీఆర్ఎస్​ నాయకులు రెచ్చగొట్టడం ద్వారానే లగచర్లలో అధికారులపై దాడి జరిగింది. బీఆర్ఎస్​ నాయకులు చేసిన తప్పునకు ఊరుంతా బలి చేశారు. దాడులు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వేములవాడ డెవలఫ్​కోసం బోర్డు ఏర్పాటుకు మార్గాలను పరిశీలిస్తం.’ అని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు.

Also Read :