deepavali: లక్ష్మీపూజ ఎప్పుడు.. ఎలా చేయాలి

deepavali

దీపావళి (deepavali) పండుగలో మూడో రోజు (అమావాస్య రోజు ) ధన లక్ష్మీ పూజలు చేస్తారు. అయితే ఈ సంవత్సరం గురువారం(అక్టోబర్ 31, 2024) రోజున రాత్రి ధనలక్ష్మీ పూజలు చేయాల్సి ఉంటుంది. (deepavali) శుక్రవారం( నవంబర్ 1, 2024) రోజున మధ్యాహ్నానికి అమావాస్య తిథి వెళ్లిపోయి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అమావాస్య సాయంకాలం ఉన్న సమయంలోనే ధనలక్ష్మీదేవికి పూజలు చేయాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు. అశ్వీయుజ బహుళ అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు చంద్రుడు కనిపించడు.. అంతా చీకట్లు కమ్ముకుంటాయి. ఈ సమయంలో చమురు దీపాలు వెలిగించి.. కాంతిమయం చేసి సంపదలకు ఆది దేవత అయిన ధనలక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి ఎంతో సంతోషిస్తుందంటారు. అమావాస్య అంటే అజ్ఞానం అని, దీపం అంతో కాంతి అనే జ్ఞానమని, దానిని వెలిగించడంతో ప్రపంచాన్ని జ్ఞానంతో నింపుతున్నామనే భావన కలిగించేందుకు దీపాలు వెలిగిస్తారని చెబుతారు. పురాణ విశ్వాసం ఏమిటంటే పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవి ఉద్భవించింది.

Image

అప్పటి నుంచి దీపావళి రోజున లక్ష్మీదేవిని పుజిస్తారు. సముద్రాన్ని మథనం చేసే ఈ సంఘటన కూడా రాత్రి సమయంలో జరిగిందని..ఈ కారణంగా రాత్రి సమయం లక్ష్మీ పూజకు మరింత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి రాత్రి వేళ భూమిపై సంచరిస్తుందని, ప్రకాశవంతంగా, శుభ్రంగా ఉన్న ఇళ్లలోకి మాత్రమే వస్తుందనేది నమ్మకం. అశ్వీయుజ బహుళ అమావాస్య రోజున ధనలక్ష్మీదేవిని పూజించడం ద్వార విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుందనే నమ్మకం అనాదిగా వస్తోంది. ఆ రోజు ఒక పీఠంపై ఒక బ్లౌజ్ పీస్ పరిచి.. దాంట్లో బియ్యం పోసి.. నవగ్రహాలు, అష్టదిక్పాలకులను ఉంచి ( తమల పాకుల్లో ఎండు కర్జూరం, పోక, రూపాయి బిళ్ల) ఉంచాలి. లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టాలి. ముందు కలశస్థాపన చేసుకోవాలి. అమ్మవారి చిత్రపటాన్న వస్త్రం.. అందమైన పూలతో అ లంకరించాలి. కలువ పూలు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రం. కనీసం ఒక్కపూవైనా పూజలో ఉండేలా చూసుకోవాలి. గవ్వలు, కాటుక, బొట్టు, పసుపు, కుంకుమ, ఇలాంటి సౌభాగ్యవస్తువలను అమ్మవారి ముందు ఒక చిన్న గిన్నెలో ఉంచాలి. వీలైనన్న దీపాలు ఇంట్లో, బయట వెలిగించాలి..అనంతరం లక్ష్మీదేవి పూజలు నిర్వహించాలి. అమ్మవారికి తెల్లని తినుబండారంటే బాగా ఇష్టం. అందుకే వరిపేలాలు, దూద్ పేడా, క్షీరాన్నం లాంటివి నైవేద్యంగా సమర్పించాలి. భక్తి ప్రపత్తులతో ధనలక్ష్మీదేవిని పూజిస్తే ఏడాదంతా శుభం జరగుతుందని, డబ్బుకు లోటు ఉండదని ప్రగాఢంగా విశ్వసిస్తారు.

Image

Also read: