(Diwali) దీపావళి అంధకారంపై వెలుగు విజయం చెడుపై మేలుకి గెలుపు లోభం, ద్వేషం, అజ్ఞానంపై జ్ఞానం విజయం. (Diwali) దీపం వెలిగించడం అంటే మన హృదయంలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగించడం అని అర్థం. తేదీ: 20-10-2025 (సోమవారం)
హారతులు:
🕔 ఉదయం 05:30 నుంచి 07:30 వరకు
🕘 ఉదయం 09:00 నుంచి 10:30 వరకు
ఈ సమయాలలో హారతులు చేయుట శుభము.
లక్ష్మీ పూజలు:
మధ్యాహ్నం 03:00 గంటల నుండి
రాత్రి 10:30 గంటల వరకు
ఈ సమయములో శ్రీ ధనలక్ష్మీ పూజలు నిర్వహించుట అత్యంత శుభప్రదము.
ముఖ్య సూచన (IMP):
కొత్త అల్లుళ్లకు ఈ సంవత్సరం అనుకూలము — శుభము.
లక్ష్మీ పూజ అనంతరం వెంటనే “ఉద్వాసన” కందిలించి ముహూర్తం చేసుకోవచ్చు.
దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మీ దేవి పూజ చేయడం అత్యంత శుభకరంగా పరిగణించబడుతుంది. ఈ పూజ ధనసమృద్ధి, ఐశ్వర్యం, శాంతి, సుఖసమృద్ధులను అందిస్తుంది.
క్రింద చెప్పిన విధంగా మీరు ఇంట్లో సులభంగా లక్ష్మీ పూజ చేయవచ్చు👇
పూజకు కావలసిన వస్తువులు
-
లక్ష్మీ దేవి విగ్రహం లేదా ఫోటో
-
గణేశుడు విగ్రహం (లక్ష్మీ పూజకు ముందు గణేశ పూజ తప్పనిసరి)
-
పసుపు, కుంకుమ, చందనం
-
దీపాలు (నూనె దీపం, వెన్న దీపం)
-
బత్తి, పూలు, ఆకులు
-
పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి (పంచామృతం)
-
కొత్త బట్టలు లేదా చీర
-
పండ్లు, సweets, డ్రై ఫ్రూట్స్
-
బియ్యం (అక్షతలు), కలశం, గంగాజలం
-
బంగారం, వెండి లేదా నాణేలు (ధనలక్ష్మీ సూచిక)
-
ధూపం, దీపం
పూజ విధానం
1. స్నానం & శుభ్రత
పూజకు ముందు ఇంటిని పూర్తిగా శుభ్రం చేయాలి. తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. ముఖ్యంగా పూజ స్థలాన్ని శుభ్రపరిచి అలంకరించాలి.
2. గణేశ పూజ
ముందుగా విఘ్నేశ్వరుడి పూజ చేయాలి. దీపం వెలిగించి, పుష్పాలు సమర్పించి ప్రార్థన చేయాలి:
“శ్రీ గణేశాయ నమః”
3 .లక్ష్మీ దేవి పూజ
గణేశుని పూజ తరువాత లక్ష్మీ దేవిని ఆహ్వానించండి:
“ఓం మహాలక్ష్మీ చ మమ గృహే వాసం కురు” లక్ష్మీ విగ్రహం ముందు కలశం ఉంచి గంగాజలం పోసి పూలతో అలంకరించండి. పసుపు, కుంకుమ, చందనం అర్పించండి. పూలు, అక్షతలు సమర్పించండి. దీపం వెలిగించి మహాలక్ష్మీ అష్టోత్తరం లేదా శ్రీ సుక్తం చదవండి.
4. నైవేద్యం
పాలు, పాయసం, పండ్లు, సweets సమర్పించండి. “ఓం మహాలక్ష్మ్యై నమః” అని నైవేద్యం చూపించండి.
5. ఆర్తి (హారతి)
దీపాలతో హారతి ఇవ్వాలి. కుటుంబ సభ్యులందరూ కలసి హారతి పాడాలి:
“జయ లక్ష్మీ మాతా, మంగల హారతి మాతా…”
6. ఉద్వాసన (ముగింపు)
పూజ అనంతరం దీపం ఆర్పకండి (రాత్రి మొత్తం వెలిగివుండడం శుభం). ఉద్వాసన (మంగళం) చేసి,
“ఓం శాంతిః శాంతిః శాంతిః” అని ముగించండి.
ప్రత్యేక సూచనలు
పూజ రాత్రి 7:00 నుంచి 10:30 మధ్యలో చేయడం అత్యంత శుభమని పండితులు చెబుతున్నారు. కొత్త బట్టలు, బంగారం లేదా వెండి వస్తువులు కొనడం శుభప్రదం.నల్ల వస్తువులు, ఇనుము, కత్తులు కొనరాదు.
Also read:

