తిరుమల (Tirumala) శ్రీవారి లడ్డూ వివాదాన్ని దర్యాప్తు చేసేందుకు సీబీఐ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇవాళ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం లడ్డూ కేసుపై విచారించింది. తిరుమల (Tirumala) లడ్డూ అనేది కోట్లమంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ.. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, విక్రమ్‌సంపత్ అనే భక్తుడు, సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేశ్ పిల్స్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన బెంచ్.. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కొనసాగించాలా..? లేదా ప్రత్యేక దర్యాప్తు చేయించాలా..? అన్న దానిపై కేంద్రం అభిప్రాయాన్ని చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచిస్తూ విచారణను నిన్నటికి వాయిదా వేసింది. నిన్న కేసు విచారణ జరగలేదు. ఇవాళ ఉదయం విచారణకు స్వీకరించిన జస్టిస్ గవాయ్ ద్విసభ్య ధర్మాసనం తుషార్ మెహతా అభిప్రాయాన్ని కోరింది. మొత్తం అంశాన్ని పరిశీలించాను. ‘సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవు. వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంటే ఆమోదయోగ్యం కాదు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులున్నారు. సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే మరింత విశ్వాసం పెరుగుతుంది’. అని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెంచ్ కు విన్నవించారు. కేంద్ర తరఫున ఆయన చెప్పిన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తీర్పు వెల్లడించింది. తిరుమల లడ్డూ వ్యవహారం కోట్లాది భక్తులకు సంబంధించిన అంశమని.. ఇందులో రాజకీయ డ్రామా వద్దని సుప్రీంకోర్టు కోరింది.
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదాన్ని దర్యాప్తు చేసేందుకు సీబీఐ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇవాళ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం లడ్డూ కేసుపై విచారించింది. తిరుమల లడ్డూ అనేది కోట్లమంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ.. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, విక్రమ్‌సంపత్ అనే భక్తుడు, సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేశ్ పిల్స్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన బెంచ్.. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కొనసాగించాలా..? లేదా ప్రత్యేక దర్యాప్తు చేయించాలా..? అన్న దానిపై కేంద్రం అభిప్రాయాన్ని చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచిస్తూ విచారణను నిన్నటికి వాయిదా వేసింది. నిన్న కేసు విచారణ జరగలేదు. ఇవాళ ఉదయం విచారణకు స్వీకరించిన జస్టిస్ గవాయ్ ద్విసభ్య ధర్మాసనం తుషార్ మెహతా అభిప్రాయాన్ని కోరింది. మొత్తం అంశాన్ని పరిశీలించాను. ‘సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవు. వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంటే ఆమోదయోగ్యం కాదు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులున్నారు. సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే మరింత విశ్వాసం పెరుగుతుంది’. అని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెంచ్ కు విన్నవించారు. కేంద్ర తరఫున ఆయన చెప్పిన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తీర్పు వెల్లడించింది. తిరుమల లడ్డూ వ్యవహారం కోట్లాది భక్తులకు సంబంధించిన అంశమని.. ఇందులో రాజకీయ డ్రామా వద్దని సుప్రీంకోర్టు కోరింది.
Also read:

