Jagtial: కొండగట్టులో జనజాతర

Jagtial

జగిత్యాల (Jagtial) జిల్లా కొండగట్టులో హనుమాన్​ చిన్న జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు, దీక్షాపరులు భారీగా తరలి వస్తున్నారు. జై శ్రీరామ్​ నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది. భజనలు, కోలాటాల నడుమ వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పాదయాత్రగా బయలుదేరి వస్తున్నారు. (Jagtial)వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు ఆంజనేయ స్వామికి నిష్ట పూజలు చేసి దీక్ష విరమిస్తున్నారు.

Image

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు చెప్పారు. అయితే కోనేరులో ముగురునీటిలోనే స్నానాలు చేయాల్సి వస్తోందని ఆలయానికి వస్తోన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి అనేక మంది భక్తులు కాలినడకన కొండగట్టుకు చేరుకుంటున్నారు. పాదయాత్రగా తరలి వస్తోన్న భక్తులతో కొండగట్టు పరిసరాలు కాషాయవనంగా మారిపోయాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా శీర్షాగ్రామం నుంచి కొండగట్టుకు స్వాముల పాదయాత్ర చేపట్టారు. ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేసిన మాలదారుల వెంట భారీ ఎత్తున గ్రామస్థులు కూడా కదిలారు. భజనలు, కోలాటాలతో శీర్షాగ్రామంలో పాదయాత్ర ప్రారంభమైంది. మరోవైపు వరంగల్​, సిద్దిపేట, కరీంనగర్​ రహదారుల వెంట కొండగట్టుకు పాదయాత్రగా తరలివచ్చిన భక్తులు పూజల అనంతరం దీక్ష విరమిస్తున్నారు.

Also read: