తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) దర్శించుకున్నారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయన ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం (Kishan Reddy) కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ హిందూ దేవాలయాల్లో హిందూవులే విధులు నిర్వహించాలి. ప్రముఖ దేవస్థానాలలో అన్యమతస్థులు ఉండటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి.
అన్యమతస్తులను ప్రభుత్వ రంగంలోకి బదిలీ చేయాలనే నిర్ణయం శుభదాయకం. తిరుమలలో రాజకీయ ఉపన్యాసాలు, ప్రసంగాలను నిషేధించడం శుభపరిణామం. స్థానికులకు దర్శన సదుపాయం కల్పించడం మంచి నిర్ణయం. తిరుమల పర్యాటక కేంద్రం కాదు. హిందూ దేవతలపై విశ్వాసం విధేయత ఉండే వాళ్లకే దర్శనం కల్పించడం హర్షణీయం. నూతనంగా నియామకమైన పాలకమండలి అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంది. అందుకు టీటీడీ బోర్డుకు, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.రాజకీయ పరమైన కార్యక్రమాలు చేపడితే శిక్ష విధించేలా పాలకమండలి చర్యలు తీసుకోవాలి. నిబంధనలు తుంగలో తొక్కిన వారిపై ప్రివిలేజ్, దర్శన విషయంలో కఠినంగా వ్యవహరించాలి. కొన్ని సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు గతంలో దెబ్బతిన్నాయి’ అని అన్నారు.
తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయన ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ హిందూ దేవాలయాల్లో హిందూవులే విధులు నిర్వహించాలి. ప్రముఖ దేవస్థానాలలో అన్యమతస్థులు ఉండటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. అన్యమతస్తులను ప్రభుత్వ రంగంలోకి బదిలీ చేయాలనే నిర్ణయం శుభదాయకం. తిరుమలలో రాజకీయ ఉపన్యాసాలు, ప్రసంగాలను నిషేధించడం శుభపరిణామం. స్థానికులకు దర్శన సదుపాయం కల్పించడం మంచి నిర్ణయం. తిరుమల పర్యాటక కేంద్రం కాదు. హిందూ దేవతలపై విశ్వాసం విధేయత ఉండే వాళ్లకే దర్శనం కల్పించడం హర్షణీయం. నూతనంగా నియామకమైన పాలకమండలి అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంది. అందుకు టీటీడీ బోర్డుకు, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.రాజకీయ పరమైన కార్యక్రమాలు చేపడితే శిక్ష విధించేలా పాలకమండలి చర్యలు తీసుకోవాలి. నిబంధనలు తుంగలో తొక్కిన వారిపై ప్రివిలేజ్, దర్శన విషయంలో కఠినంగా వ్యవహరించాలి. కొన్ని సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు గతంలో దెబ్బతిన్నాయి’ అని అన్నారు.
Also read:

