Khumbhamela: కుంభమేళా స్టార్ట్.. 3కోట్ల మంది స్నానాలు

Khumbhamela

త్రివేణి సంగమ క్షేత్రాన ఇవాళ మహాద్భుతం ఆవిష్కృతమైంది. పుష్య పౌర్ణమి వేళ పన్నెండేండ్లకు ఒక్క సారి వచ్చే కుంభమేళా (Khumbhamela) ప్రారంభమైంది. అఘోరాలు, నాగసాధువుల హర హర మహాదేవ్ నినాదాల మధ్య మొదటి షాహీ స్నానం చేసేందుకు భక్తులు పోటీ పడ్డారు. త్రిశూల ధారులైన అఘొరాలతో గంగ, సరస్వతి, యమున క్షేత్రం ప్రజ్వరిల్లింది. భక్తి పారవశ్యం మిన్నంటింది. ప్రయాగ్ రాజ్ వీధుల్లో అఘోరాలు శివతాండవం చేశారు. ఇవాళ ఉదయం 9.30 వరకు 60 లక్షల మంది పుణ్య స్నానాలు చేశారు. ఇవాళ రాత్రి వరకు మూడు కోట్ల మంది పుణ్య స్నానాలు చేస్తారని అంచనా వేసింది. కుంభమేళాను (Khumbhamela) పురస్కరించుకొని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. త్రివేణి సంగమ ప్రాంతాన్నే ఒక తాత్కాలిక జిల్లాగా ఏర్పాటు చేయడంతోపాటు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపట్టింది. మునుపెన్నడూ లేని విధంగా ఎయిర్, వాటర్ డ్రోన్ల సేవలను వినియోగించుకుంటోంది. భక్తుల బస కోసం టెంట్ సిటీనే నిర్మించింది. రబ్బ ర్ బ్రిడ్జిలను నిర్మించింది. ఎప్పటికప్పుడు గజ ఈతగాళ్లను సిద్ధం చేసింది. రైల్వేశాఖ ఈ 45 రోజుల పండుగ కోసం ఏకంగా 13 వేల ప్రత్యేక రైళ్లను నడుపుతుండటం విశేషం.

Image

నీటి పై తేలియాడే పోలీస్ స్టేషన్
నదిలో నిరంతరం పహారా కాసేందుకు ప్రత్యేకంగా తేలియాడే పోలీసుస్టేషన్‌ను ఏర్పాటుచేశారు. అటు చిన్నచిన్న పడవలపై భద్రతా సిబ్బంది పెట్రోలింగ్‌ చేస్తున్నారు. 10,000 ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు జరిగాయి. ఏ సమయంలోనైనా 50 లక్షల మంది నుంచి కోటి మంది ఉండగలిగేలా సౌకర్యాలను కల్పించామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఇప్పటికే వెల్లడించారు. భద్రత కోసం 55 పోలీస్‌స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. 45,000 మంది పోలీసులను మోహరించింది. సాధువులకు సంబంధించిన 13 అఖాడాలు కుంభమేళాలో భాగమయ్యాయి.

Image

విదేశీయుల పుణ్యస్నానాలు
పన్నెండేండ్లకు ఒక సారి వచ్చే కుంభమేళాకు ప్రపంచంలోని నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. విదేశీ భక్తులు సైతం షాహీ స్నానాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ మహోజ్వల ఘట్టంలో భాగంగా కావడం ఆనందంగా ఉందని చెప్పారు.

Image

Also read: