హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా భావించబడే రామాయణ (Ramayana) యాత్రకు సంబంధించి ఐఆర్సీటీసీ మరోసారి విశిష్ట పర్యటనను ప్రారంభించబోతోంది. భక్తి, ఆధ్యాత్మికతతో నిండి ఉండే ఈ యాత్ర జూలై 25వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. (Ramayana) ఈ యాత్రలో భగవాన్ శ్రీరాముడు నడిచిన పవిత్ర ప్రాంతాలను సందర్శించే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తున్నారు.
ఈ పర్యటన మొత్తం 17 రోజుల పాటు కొనసాగనుంది. మొత్తం 16 రాత్రులు, 17 రోజుల ఈ పర్యటన జూలై 25వ తేదీన ఢిల్లీలోని సఫ్దార్‌గంజ్ రైల్వే స్టేషన్ నుంచి మొదలవుతుంది. అక్కడినుంచి నేరుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య రైల్వే స్టేషన్‌కి చేరుకుని యాత్ర మొదలవుతుంది.
ఈ యాత్రలో ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు – అయోధ్య, సీతామఢి, వారణాసి, ప్రయాగ్‌రాజ్, నాసిక్, హంపి, పాండవపురం, బద్రినాథ్, రామేశ్వరం తదితర ప్రాంతాల సందర్శన ఉంటుందని ఐఆర్సీటీసీ తెలిపింది. ఈయాత్ర 5వ విడతగా నిర్వహించబడుతోంది. ప్రత్యేకత ఏమిటంటే, ఈయాత్ర భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలులో నిర్వహించబడుతోంది.
ఈ రామాయణ యాత్రలో మొత్తం 150 మంది యాత్రికులకు మాత్రమే అవకాశం కల్పించబడుతుంది. టికెట్ ధర ఒక్క యాత్రికుడికి ₹1,15,180గా నిర్ణయించారు. ఇందులో ఆహారం, వసతి, దర్శన ఏర్పాట్లు, ప్రయాణ భద్రతతో సహా పలు సౌకర్యాలు ఉన్నాయి. యాత్ర మొత్తం భారతీయ రైల్వే శాఖకు చెందిన ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో నడపబడుతుంది.
ఈ యాత్రలో శ్రీరాముని జీవన ప్రస్థానానికి సంబంధించిన పలు ప్రాంతాలను సందర్శించనుండటంతో భక్తులలో విశేష ఉత్సాహం నెలకొంది. ఇటువంటి యాత్రలు భక్తులకు కేవలం దర్శనానందాన్ని మాత్రమే కాకుండా, భారతీయ సంస్కృతి, పురాణ చరిత్రపై అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ప్రస్తుతం టికెట్ల కోసం ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్లో బుకింగ్‌లు ప్రారంభమయ్యాయని సంస్థ పేర్కొంది. భక్తులు వీలైనంత తొందరగా బుక్ చేసుకోవాలంటూ విజ్ఞప్తి చేసింది.
Also read:

