శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సప్తగిరులు ముస్తాబయ్యాయి(Tirupati). రేపటి నుంచి శ్రీవారు వివిధ వాహన సేవల్లో భక్తులను అనుగ్రహించనున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యమిచ్చేలా, వారు సులువుగా శ్రీవారి వాహన సేవల్లో పాల్గొనేలా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత బ్రహ్మోత్సవాల అనుభవాల నేపథ్యంలో పొరపాట్లకు తావులేకుండా చర్యలు చేపడుతున్నారు. శ్రీవారికి సీఎం చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
బాలా త్రిపుర సుందరిగా కనకదుర్గ
శైలపుత్రిగా భ్రమరాంబిక
శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గాదేవి బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన
గౌరీదేవి అని అర్ధము. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము త్రిపుర సుందరీదేవి అధీనములో ఉంటాయి. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన అమ్మను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం(Tirupati). శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబికా దేవి.. శైలపుత్రిగా భక్తులను అనుగ్రహించనున్నారు. ఇవాళ సాయంత్రం అమ్మవారిని శైలపుత్రిగా అలంకరిస్తారు. భృంగివాహనంపై ఆది దంపతులు ఆసీనులై శ్రీశైల పురవీధుల్లో విహరిస్తారు.
Also Read :

