విశాఖ పట్నం జిల్లా సింహాద్రి (Simhachalam) అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామి వారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందాగా.. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో (Simhachalam) భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్‌పై సిమెంట్ గోడ కూలింది. వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఐదుగురిని అధికారులు గుర్తించారు. యడ్ల వెంకటరావు(48),దుర్గా స్వామినాయుడు(32), మణికంఠ(28), పిళ్లా ఉమా మహేశ్వరరావు(30), పిల్ళా శైలజ(26)గా గుర్తించారు. మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. బాధితులను కేజీహెచ్ కు తరలించి చికిత్సలు చేయిస్తున్నారు. కేజీహెచ్ మార్చురి వద్దకు చేరుకుంటున్న మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
సింహాచలంలో గోడ కూలిన ఘటనలో ఏడుగురు మృత్యువాత పడటంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు ట్విట్టర్ వేదికగా తెలిపారు. గాయపడిన వారి కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున అందిస్తామని ట్వీట్ చేశారు. సింహాచలం ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Also read: