Deepavali: దీపావళి హారతులు ఎప్పుడు..?

deepavali

దీపావళి (Deepavali) పండుగలో హారతులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. నరకచతుర్దశి రోజు ఉదయత్పూర్వంలో హారతులు తీసుకుంటారు. ఈ సంవత్సరం (క్రోధినామ సంవత్సర,ఉత్తరాయన, ఆశ్వీయుజ బహుళ చతుర్దశి ఘడియలు ) అక్టోబర్ 31వ తేదీన నరకచతుర్దశి వస్తుంది. అంటే గురువారం రోజున సూర్యోదయానికి చుతుర్దశి ఘడియలు ఉంటాయి. కాబట్టి గురువారం తెల్లవారు జామున 6.37 లోపు హారతులు తీసుకోవాలి. అలా వీలు కాని వారు 8.30 గంటల తర్వాత ఉదయం 11 గంటల వరకు (Deepavali) హారతులు స్వీకరించవచ్చు. ఉదయం రెండు గంటల పాటు వర్జ్యం ఉన్నందున ఆ సమయంలో స్వీకరించరాదని పండితులు చెబుతున్నారు.

Image

నరకచతుర్దశి ఎందుకు..

మన పండుగలకు ప్రత్యేక స్థానం ఉంటుంది.  అది సైంటిఫిక్ గా చూసినా.. పురాణాల ప్రకారం చూసినా.. ధర్మం ప్రకారం చూసినా.. పండుగలకు ఉన్న ప్రత్యేకతే వేరు. దీపావళి పండుగలో రెండో రోజు నరకచతుర్దశిని జరుపకొంటారు. నరకాసురుడిని సత్యభామ వధించిన రోజే నరక చతుర్దశి. పురాణ కథల ప్రకారం నరకాసురుడు అనే రాక్షసుడు భూమిలో ప్రజలను తీవ్రంగా హింసించాడని చెబుతారు. అతను దేవతలను అవమానించడమే కాకుండా, వారి శక్తులను దుర్వినియోగం చేశాడు. ప్రజలు అతని బాధల నుండి విముక్తి కోరినప్పుడు, శ్రీకృష్ణుడు, సత్యభామతో కలిసి నరకాసురుని యుద్ధం చేస్తారు. ఆ సమయంలో సత్యభామ నరకుడిని వధిస్తుంది. ఈ విజయం సాధించిన రోజునే నరకచతుర్దశి జరుపుకొంటాం. ఈ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తైలాభ్యంగ స్నానాన్ని (నూనె స్నానం) చేస్తాం. దీపావళి నుంచి చలికాలం మొదలవుతుంది. నువ్వుల నూనెను శరీరానికి రాసుకొని స్నానం చేయడం ద్వారా మన బాడీకి వేడి కలుగుతుంది. ఇది శరీరానికి శక్తిని, మనసుకు ప్రశాంతిని ఇస్తుందని నమ్ముతారు. నరకుడి వధ జరిగినందన సంతోషంతో హారతులు తీసుకొని.. విజయం వైపు అడుగులు వేస్తాం..

Image

సేమ్యాలు సేవించడం

సేమ్యాలు దీపావళి ప్రత్యేక వంటకం.. ఇప్పుడు మార్కెట్ లో పేనీలు కూడా దొరుకుతున్నాయి. అయితే తెలంగాణ ప్రాంతంలో పూర్వం నుంచి సేమ్యాలు తయారు చేసుకోవడం వాటిని వండి వార్చి.. దేవదేవుడైన శ్రీహరికి నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తారు.  

Also read: