(Dhanteras) ఏడాదంతా ఇంట్లో వారికి అపమృత్యుదోషాలు కలుగకుండా ఉండేందుకు, సంపూర్ణ ఆరోగ్యంతో విలసిల్లేందుకు బలిదీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు. (Dhanteras) గిన్నెలోకి కొద్దిగా గోధుమ పిండి తీసుకొని అందులో బెల్లం తురుము, పచ్చిపాలు(ఆవు) పోసి పిండిదీపాన్ని సిద్ధం చేసుకోవాలి. దానిని ఇంటి గుమ్మం ముందు పెట్టి అందులో నువ్వుల నూనె పోసి దక్షిణం వైపు అభిముఖంగా ఎన్నైనా వత్తులు వేసి వెలిగించుకోవచ్చు. బలిదీపం వద్ద ఒక తమలపాకు ఉంచి అందులో రాగి నాణెం, గవ్వ ఉంచాలి.
నైవేద్యం
బలిదీపం దగ్గర తమలపాకులో కొద్దిగా బియ్యం, బెల్లం నైవేద్యంగా పెట్టాలి. బలిదీపం కొండెక్కిన తర్వాత.. మరుసటి రోజు స్నానం చేసిన పిండి దీపం, నాణెం, గవ్వ, నైవేద్యం ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. లేదా పారే నీళ్లలో విడిచి పెట్టాలి. మనకు ఉన్న అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు దరిచేరవని పండితులు చెబుతున్నారు.
ఏడాదంతా ఇంట్లో వారికి అపమృత్యుదోషాలు కలుగకుండా ఉండేందుకు, సంపూర్ణ ఆరోగ్యంతో విలసిల్లేందుకు బలిదీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు. గిన్నెలోకి కొద్దిగా గోధుమ పిండి తీసుకొని అందులో బెల్లం తురుము, పచ్చిపాలు(ఆవు) పోసి పిండిదీపాన్ని సిద్ధం చేసుకోవాలి. దానిని ఇంటి గుమ్మం ముందు పెట్టి అందులో నువ్వుల నూనె పోసి దక్షిణం వైపు అభిముఖంగా ఎన్నైనా వత్తులు వేసి వెలిగించుకోవచ్చు. బలిదీపం వద్ద ఒక తమలపాకు ఉంచి అందులో రాగి నాణెం, గవ్వ ఉంచాలి.

Also read: