Yadagirigutta: శ్రీకృష్ణుడిగా నారసింహుడు

శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం(Yadagirigutta) వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ స్వామివారు శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. కృష్ణుడిగా స్వామివారిని అందంగా ముస్తాబు చేసిన అర్చకులు.. ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. (Yadagirigutta) అనంతరం తూర్పు ద్వారం ఎదుట శ్రీకృష్ణ అలంకార సేవను అధిష్టింపజేసి అవతార విశిష్టతను భక్తులకు వివరించారు. యజ్ఞాచార్యుల వేదపఠనాలు, పారాయణీకుల వేదపారాయణాలు, రుత్వికుల మూలమంత్ర, మూర్తిమంత్ర జపాల మధ్య శృకృష్ణ అలంకార సేవను ఘనంగా నిర్వహించారు. ఇవాళ్టి సేవలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు.

Also read: