వివాదాస్పద దర్శకుడు (RGV) రాంగోపాల్ వర్మను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. కేసు విచారణ నుంచి ఉపశమనం లభించిందని భావించిన ఆర్జీవీకి సీఐడీ మరోసారి షాకిచ్చింది. విచారణకు హాజరు కావాలంటూ ఇవాళ మరోసారి అధికారులు నోటీసులు జారీ చేశారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరి సీఎస్ లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆ కేసులో ఫిబ్రవరి 10న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేయగా… వాటిని సవాలు చేస్తూ వర్మ (RGV) హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కేసు ట్రయల్ నడుస్తుండగానే ఆయనకు గుంటూరు సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు ఇవ్వడం ఆసక్తిగా మారింది.
ఇక ఈ కేసు విషయానికొస్తే… కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతో ఆర్జీవీ 2019లో ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా పేరు పట్ల అభ్యంతరం తెలుపుతూ తెలంగాణ హైకోర్టులో కొంతమంది పిల్ వేయడంతో సినిమా పేరును మారుస్తూ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు పేరుతో తెరకెక్కించారు. అయితే యూ ట్యూబ్ లో మాత్రం పేరు మార్చకుండానే, రెచ్చగొట్టే సన్నివేశాలను తొలగించకుండానే విడుదల చేశారంటూ మంగళగిరి సమీపంలోని ఆత్మకూరుకు చెందిన వంశీకృష్ణ సీఐడీకి ఫిర్యాదు చేశారు. గతేడాది నవంబరు 29న కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు విచారణకు హాజరు కావాలంటూ ఇటీవల వర్మకు నోటీసులు ఇవ్వగా, ఆయన గడువు కోరారు.

Also read:
- Seethakka: గత సర్కార్ చేయలేనిది మేం చేసినం
- America: అమెరికాలో కాల్పులు.. రంగారెడ్డి జిల్లా విద్యార్థి మృతి