కందిరీగ సినిమాలో రామ్ సరసన నటించిన ముద్దుగుమ్మ అక్ష పార్థసాని(aksha pardasany). రైడ్, బెంగాళ్ టైగర్, డిక్టేటర్ సినిమాల్లోనూ నటించిందీ ఈ ముంబై బ్యూటీ. 2008లో యువత సినిమాతో టాలీవుడ్‌లో ప్రవేశించిన అక్ష పార్థసాని(aksha pardasany) ఇటీవల సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. ఖాట్మండూ కనెక్షన్ అనే వెబ్ సిరీస్ తో పాపులరైంది. ఆ తర్వాత జమ్తారా, రఫుచక్కర్ సహా పలు సిరీస్ లలో నటించింది. క్యూట్ లుక్స్ హాట్ అప్పియరెన్స్ తో అలరించే ఈ బ్యూటీ గురించి అభిమానులకు తాజాగా శుభవార్త చెప్పింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కౌశల్ ని అక్ష ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అక్ష పెళ్లి తర్వాత వెబ్ సిరీస్ లు, సినిమాల్లో నటించే ఆలోచనలో ఉందట. గెహ్రయాన్, ముంబై డైరీస్, బాడీస్ ఆఫ్ డిజైర్, బటర్ ఫ్లైస్ సహా పలు చిత్రాలకు కౌశల్ షా సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు.
